Telangana: కేఆర్ఎంబీకి మరో లేఖ రాసిన తెలంగాణ ఈఎన్సీ

Telangana ENC Wrote a Letter to KRMB About Handri Niva Sujala Sravanthi Project
x

కేఆర్ఎంబీకి మరో లేఖ రాసిన తెలంగాణ ఈఎన్సీ(ఫోటో- ది హన్స్ ఇండియా)

Highlights

*హంద్రీనివా విస్తరణ పనులను అడ్డుకోవాలని విజ్ఞప్తి *అనుమతులు లేకుండానే విస్తరణ పనులు చేస్తున్నారని ఆరోపణ

Telangana ENC - KRMB: ఏపీ జల వివాదాలపై కేఆర్‌ఎంబీ కి తెలంగాణ లేఖల పర్వం కొనసాగుతోంది. హంద్రీనివా సుజల స్రవంతి ప్రాజెక్టుపై మరోసారి కేఆర్ఎంబీకి తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం హంద్రీనివా విస్తరణలో భాగంగా రెండోదశలో 680 జిల్లేడుబండ జలాశయ నిర్మాణానికి పరిపాలనా అనుమతులిచ్చి టెండర్లకు పిలిచింది. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ లేఖ రాసిన తెలంగాణ ఈఎన్సీ గతంలోనే ప్రాజెక్టు విస్తరణను అనుమతించవద్దని లేఖలు రాసినట్లు గుర్తు చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఏపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండానే విస్తరణ చేపడుతుందని లేఖలో ఆరోపించింది. ఈ విస్తరణ పనులను నిలువరించాల్సిందిగా కోరుతూ కేఆర్ఎంబీకి తెలంగాణ సర్కార్ లేఖ రాసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories