ఉన్నత విద్యలో సిలబస్‌ తగ్గనుందా?

ఉన్నత విద్యలో సిలబస్‌ తగ్గనుందా?
x
Highlights

కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. దీంతో వచ్చే ఏడాది పరీక్షల సమయం వరకు ప్రస్తుతం ఉన్న సిలబస్...

కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. దీంతో వచ్చే ఏడాది పరీక్షల సమయం వరకు ప్రస్తుతం ఉన్న సిలబస్ సకాలంలో పూర్తి చేయలేరు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఓ నిర్ణయం తీసుకోనుంది. సాంకేతిక విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్, జేఎన్‌టీయూ ఇన్‌చార్జి వీసీ జయేశ్‌రంజన్, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి తదితరులు బుధవారం ఇంజనీరింగ్, ఇతర కాలేజీల యాజమాన్యాలతో ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షలు, విద్యా సంవత్సరానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. అంతే కాకుండా కేంద్రం ఉన్నత విద్యలో సిలబస్‌ను, పని దినాలను 50 శాతానికి తగ్గించేందుకు కసరత్తు చేస్తోందని సమాచారం. ఆ మార్గదర్శకాలు ప్రకటించిన తరువాత పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని ఉన్నత స్థాయి సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది.

ఇక ఈ సమావేశంలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ముందుకు సాగాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక కేంద్రం ముందస్తుగానే ఈ మార్గదర్శకాలను అందుబాటులోకి తీసుకువస్తే వాటికి అనుగుణంగా విద్యాసంస్ధలు ముందుకు సాగాలని, లేని పక్షంలో రాష్ట్రంలో ముందుగా ఆన్‌లైన్‌లో పాఠాలను సెప్టెంబర్‌లో ప్రారంభించనున్నారనే సమాచారం. ఆన్ లైన్ తరగతులు జరుగుతున్న సమయంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడితే వాటిని దాన్ని బట్టి ఆఫ్‌లైన్‌ తరగతుల నిర్వహణకు చర్యలు చేపట్టాలన్న అభిప్రాయానికి వచ్చారు.

ఇక చాలా మంది విద్యార్ధులు ఇంజనీరింగ్‌ పూర్తి చేసుకుని విద్యార్థులు విదేశీ విద్యకు, ఉద్యోగాల కోసం వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి ఈనెల 20 నుంచి పరీక్షలు నిర్వహించాల్సిందేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక మరో వైపు తెలంగాణ రాష్ట్రంలో కళాశాలలను సెప్టెంబరులో తెరచినప్పటికీ వసతి గృహాలను తెరవకూడదని తెరిస్తే విద్యార్ధులు భౌతిక దూరం పాటించడం కష్టం అవుతుందన్న భావన వ్యక్తమైంది. ఇక రాష్ట్రంలో నిర్వహించనున్న డిగ్రీ, పీజీ పరీక్షలకు సంబంధించిన అలాగే కాలేజీల ప్రారంభం గురించి ఈనెల 15వ తేదీన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో భేటీ కానున్నట్లు తుమ్మల పాపిరెడ్డి తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories