10వ తరగతిలో 6 పేపర్లు ఉండేలా తెలంగాణ విద్యాశాఖ ప్రణాళికలు

10వ తరగతిలో 6 పేపర్లు ఉండేలా తెలంగాణ విద్యాశాఖ ప్రణాళికలు
x
Highlights

విద్యారంగంపై కరోనా మహమ్మారి పెను ప్రభావం చూపింది. వైరస్‌ వ్యాప్తి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలు, టుటోరియల్స్ పూర్తిగా మూతబడ్డాయి. దీంతో విద్యార్థుల భవిష్యత్తు ఒక్కసారిగా అంధకారంలోకి నెట్టబడింది.

విద్యారంగంపై కరోనా మహమ్మారి పెను ప్రభావం చూపింది. వైరస్‌ వ్యాప్తి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలు, టుటోరియల్స్ పూర్తిగా మూతబడ్డాయి. దీంతో విద్యార్థుల భవిష్యత్తు ఒక్కసారిగా అంధకారంలోకి నెట్టబడింది. విద్యా సంవత్సరమంతా వృధా అయిపోయింది. కరోనా నింబధనలు పాటిస్తూ.. విద్యను బోధించాలని అనుకున్నప్పటికీ.. స్టూడెంట్స్‌ను స్కూళ్లు, కాలేజీలకు పంపించేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా లేకపోవడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది విద్యాశాఖ. దీంతో టీచర్లు, స్టూడెంట్స్‌ ఇళ్లకే పరిమితమయ్యారు.

మరోవైపు 10వ తరగతి పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షలు నిర్వహించాల్సిందేనని ఫిక్స్‌ అయిపోయింది. దీంతో విద్యార్థులపై ఒత్తిడి పడకుండా.. అవసరమైతే పేపర్ల సంఖ్యను తగ్గించయినా ఎగ్జామ్స్‌ పెట్టాలని భావిస్తోంది. ఇప్పటికే ఈ ప్రక్రియపై పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. మే నెలలో పరీక్షలను ప్రారంభించాలని రెండు నెలల క్రితమే విద్యాశాఖ ప్రకటించింది. ఈ క్రమంలోనే పరీక్షలకు కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం.

ఇక.. ఇప్పటివరకు చూస్తే.. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఒక్క హిందీ తప్ప మిగిలిన సబ్జెక్టులకు రెండేసి పేపర్లు చొప్పున ఉంటాయి. విద్యార్థులు మొత్తం 11 పేపర్లు రాయాల్సి ఉంటుంది. అయితే.. ఇప్పుడు ఆ సంఖ్యను ఆరుకు కుదించాలని చూస్తున్నారు విద్యాశాఖ అధికారులు. ఒక్కో సబ్జెక్టుకు ఒకే పేపరు ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల 50వేల మంది పదో తరగతి విద్యార్థులున్నారు. స్కూళ్లు ఓపెన్‌ అయిన తర్వాత పనిదినాలను బట్టి పేపర్ల కుదింపుపై తుది నిర్ణయం తీసుకుంటామని అధికారవర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు తెరవడంపై విద్యాశాఖ నిర్ణయాలు మారుతూనే వస్తున్నాయి. సంక్రాంతి తర్వాత స్కూళ్లను తెరిచి 9, 10 తరగతులకు క్లాసులు నిర్వహించాలని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశాలతో ఇప్పటివరకు ఏయే రాష్ట్రాల్లో బడులు తెరిచారో అధికారులు సేకరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories