TS EAMCET 2021: ఇంజినీరింగ్‌లో 82.08%, అగ్రికల్చర్‌ లో 92.48 % క్వాలిఫై

TS EAMCET 2021 Results Released
x

TS EAMCET 2021 Results (ఫైల్ ఫోటో)

Highlights

* ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి *ఇంజినీరింగ్‌లో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కార్తికేయకు ఫస్ట్‌ ర్యాంక్

TS EAMCET Results 2021: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వెల్లడయ్యాయి. జేఎన్ టీయూలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల ఎంసెట్ ర్యాంకులను ప్రకటించారు. ఇంజినీరింగ్‌లో 82.08 శాతం మంది విద్యార్థులు క్వాలిఫై కాగా, అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌లో 92.48 శాతం మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ మొదటి విడత ఈనెల 30న ప్రారంభమవుతుంది.

సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఈనెల 30 నుంచి సెప్టెంబర్‌ 9 వరకు ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్‌ చేసుకోవాలని మంత్రి సబితా తెలిపారు. సెప్టెంబర్‌ 4 నుంచి 11 వరకు ధ్రువపత్రాలను పరిశీలిస్తామని, సెప్టెంబర్‌ 4 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories