రాష్ట్రంలో భర్తీ అయిన ఇంజినీరింగ్‌ సీట్ల వివరాల వెల్లడి

రాష్ట్రంలో భర్తీ అయిన ఇంజినీరింగ్‌ సీట్ల వివరాల వెల్లడి
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్‌ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ అయిన ఇంజినీరింగ్‌ సీట్ల వివరాలను ‌ శనివారం అధికారులు వెల్లడించారు. తొలి విడుత 71.49 శాతం...

తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్‌ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ అయిన ఇంజినీరింగ్‌ సీట్ల వివరాలను ‌ శనివారం అధికారులు వెల్లడించారు. తొలి విడుత 71.49 శాతం ఇంజినీరింగ్‌ సీట్లు భర్తీ అయ్యాయని, ఇంకా 19,998 సీట్లు మిగిలాయని తెలిపారు. 3,091 ( 98.5 శాతం) సీట్లను రాష్ట్రంలోని 14 యూనివర్సిటీ కళాశాలల్లో కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. 13 యూనివర్సిటీలు, 35 ప్రైవేట్‌ కళాశాలల్లో సీట్లన్నీ భర్తీ అయ్యాయి. 164 ప్రైవేట్‌ కళాశాలల్లో 47,046 బీటెక్‌ సీట్లు కేటాయించారు.

అయితే మూడు ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఒక్క సీటు కూడా భర్తీ కాలేదు. బీఫార్మసీ, ఎంపీసీ కోటాలో కేవలం 4.02 శాతం సీట్లు మాత్రమే భర్తీ కాగా 4,324 సీట్లు మిగిలాయి. బీటెక్‌లోని 21 కోర్సుల్లో సీట్లన్నీ నిండాయి. ఈ నెల 29 నుంచి తుది విడుత ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇక తొలివిడుత కౌన్సిలింగ్ లో సీట్ వచ్చిన అభ్యర్థులు ఈ నెల 28లోగా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ సూచించారు.

ఈక్రమంలోనే ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి మాట్లాడుతూ ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజ్‌ తొలగించేందుకు యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక వేళ ప్రభుత్వం అంగీకరిస్తే వెయిటేజ్‌ తొలగించి కేవలం ఎంసెట్‌ మార్కుల ఆధారంగానే ర్యాంకులు కేటాయిస్తామని వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories