Telangana Rain Alert: తెలంగాణలో వడగళ్లతో కూడిన భారీ వర్షం.. మరో రెండు రోజులు అల్లకల్లోలమే

Telangana Rain Alert: తెలంగాణలో వడగళ్లతో కూడిన భారీ వర్షం.. మరో రెండు రోజులు అల్లకల్లోలమే
x
Highlights

Telangana Heavy Rain Alert: తెలంగాణలో శుక్రవారం వర్షం దంచికొట్టింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. మరో...

Telangana Heavy Rain Alert: తెలంగాణలో శుక్రవారం వర్షం దంచికొట్టింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది.

శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రంతా ఈదురుగాలులు, భారీ వడగళ్లతో భారీ వర్షం పడింది. తెలంగాణలోని చాలా జిల్లాల్లో అల్లకల్లోల వాతావరణం ఏర్పడింది. హైదరాబాద్ లో దాదాపు ప్రళయమే కనిపించింది. చాలా జిల్లాల్లో వరి, మొక్కజొన్న పంటలు తీవ్ర నష్టపోయాయి. మామిడికాయలు నేలరాలాయి. కాగజ్ నగర్ లో గోడ కూలి ఓ వ్యక్తి మరణించాడు. ఊహించని విధంగా దాదాపు తుఫానులా వర్షం విరుచుకుపడింది. శనివారం, ఆదివారం కూడా ఇదే పరిస్థితి ఉండనుంది.

వర్షాలకు తోడు ఈదురుగాలులు బీభత్సమే సృష్టిస్తున్నాయి. చాలా జిల్లాల్లో పెద్ద చెట్టు కూడా నేలకూలాయి. కరెంటు స్తంభాలు పక్కకు ఒరిగాయి. వర్షాకాలంలో కూడా ఈ స్థాయి వర్షాలు పడలేదు. అలాంటిది రాత్రి భారీగా కురిసింది. నిజామాబాద్, ఆదిలాబాద్, ఉమ్మడి మెదక్, కరీంనగర్, పెద్దపల్లి, హైదరాబాద్ ఆ చుట్టుపక్కల జిల్లాలు ఉత్తర తెలంగాణ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లా.. రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ, ధర్పల్లి, మండలం మద్దుల్ తండా, హొన్నాజిపేట్, వాడీ, గుడి తండాలో కొండూరు, న్యవనంది రవుట్ల గ్రామాలలో ఈదురు గాలులతో వడగండ్ల వానకు వరిగింజలు నేలరాలాయి. ఈదురు గాలులకు వరి పంట నాశనం అయిపోయింది.

మరో రెండు రోజులు వర్షాలు ఉండటంతో ముఖ్యమంత్రి రేవంత్ పరిస్ధితిని సమీక్షించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories