Telangana Congress: టీమ్‌ వర్క్‌కు కేరాఫ్‌గా తెలంగాణ కాంగ్రెస్‌

Telangana Congress: టీమ్‌ వర్క్‌కు కేరాఫ్‌గా తెలంగాణ కాంగ్రెస్‌
x

Telangana Congress: టీమ్‌ వర్క్‌కు కేరాఫ్‌గా తెలంగాణ కాంగ్రెస్‌

Highlights

టీమ్‌ వర్క్‌కు కేరాఫ్‌గా తెలంగాణ కాంగ్రెస్‌ జిల్లాల్లో మినహా రాష్ట్రస్థాయిలో ఏకతాటిపై లీడర్లు పార్టీ, ప్రభుత్వ నిర్ణయాలపై కలిసి ముందుకు ప్రతిపక్షాలకు కౌంటర్‌ ఇవ్వడంలోనూ ఎటాకింగ్ మూడ్

గతంలో కాంగ్రెస్‌ పార్టీ అంటే.. కలహాల కాపురం అనే వారు. ఎవరు ఎవరిపైనైనా స్వేచ్చగా విమర్శలు చేయొచ్చు. బహిరంగంగా దూషణలకు దిగొచ్చు. దీనికి వారు పెట్టుకున్న పేరు అంతర్గత ప్రజాస్వామ్యం. ఇదే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని పదేళ్ల పాటు అధికారానికి దూరం చేసింది. ఒకానొక దశలో.. ఇక కాంగ్రెస్ పని ఖతం అనుకునే వరకు పరిస్థితి వెళ్లింది. కట్ చేస్తే మళ్లీ పవర్‌లోకి వచ్చి.. సీఎం రేవంత్ నేతృత్వంలో నడుస్తున్న ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో ఉన్నపళంగా మార్పు కనిపిస్తోంది. జిల్లాల్లో ఒకరిద్దరు లీడర్ల మధ్య అంతర్గత విభేదాలు మినహా.. రాష్ట్ర స్థాయి నాయకత్వంలో పెద్దగా వర్గపోరు కనిపించడం లేదు. గతంలో సీఎంను, పీసీసీ చీఫ్ నిర్ణయాలను కూడా బహిరంగంగానే విభేదించేవారు నేతలు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. టీమ్ వర్క్‌లో రేవంత్ బృందం ఒక్కటిగా ముందుకు వెళ్తోంది.


కేబినెట్‌లో తీసుకున్న ప్రభుత్వ పరమైన నిర్ణయాలపై గానీ, పార్టీ పరంగా గానీ హైకమాండ్ ఒక డెసిషన్ తీసుకుంటే పెద్దగా భిన్నాభిప్రాయాలేవి వ్యక్తం అవకుండా లీడర్లంతా కలివిడిగా ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ పాలసీలు పూర్తి స్థాయిలో అమలు అయ్యేలా సహకరిస్తున్నారు. అలాగే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకూ కృషి చేస్తున్నారు. ఎవరి విధులు, పరిధిలను వారు గుర్తిస్తూ.. తమకు ఇచ్చిన పనిని కంప్లీట్‌ చేయడంపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్య లీడర్ల మధ్య విభేదాలు, ప్రభుత్వ పెద్దలపై విమర్శలు చేస్తూ.. గతంలో ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు తెచ్చిన ఘటనలు అనేకం. కానీ రేవంత్ టీమ్‌లో.. అలాగే పార్టీలో పెద్దగా అలాంటివేమీ కనిపించడం లేదు. విభేదాలను పక్కన పెట్టడమే కాదు.. ప్రతిపక్షాలు ఏమైన విమర్శలు చేసినా, అవినీతి ఆరోపణలు చేసినా.. వెంటనే హస్తం లీడర్లు దండెత్తుతున్నారు. బాద్యత అంతా సీఎం, పీసీసీల మీద వదిలేయకుండా.. కౌంటర్ ఎటాక్స్‌కు దిగుతున్నారు. హైదరాబాద్‌లో హిల్ట్‌ భూములపైన, థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం, అంతకు ముందు హైడ్రా, గురుకుల పాఠశాలల్లో ఫుడ్‌ పాయిజన్ వంటి అంశాలపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలకు ధీటుగా సమాధానం ఇస్తున్నారు.


ఇటీవల మంత్రులు, ముఖ్యనేతలపై సీఎం రేవంత్‌కు నియంత్రణ లేదని, పార్టీపై పట్టు కోల్పోయారనే విమర్శలు వచ్చాయి. కానీ అవన్ని టీ కప్పులో తుఫాన్‌ల సమసిపోయాయి. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ఒక జట్టులా పని చేసి విజయ తీరాలకు చేరారు. తానే అభ్యర్థి అన్నట్టుగా సీఎం రేవంత్ గ్రౌండ్‌లోకి దిగితే.. జట్టు సభ్యులంతా పూర్తి సహకరాలను అందించి గెలుపులో కీలక పాత్ర పోషించారు. నోటిఫికేషన్‌కు రెండు నెలల ముందు నుంచే మంత్రులు, లీడర్లు నియోజకవర్గంలో తిష్ట వేసి.. పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నారు. ప్రచారంలోనూ ఎవరికి ఇచ్చిన టాస్క్‌ను వాళ్లు సక్సెస్‌ ఫుల్‌గా కంప్లీట్ చేశారు.


కాంగ్రెస్ పార్టీని ఎవరూ దించాల్సిన పని లేదు. వాళ్లలో వాళ్లే గ్రూప్‌ వార్‌తో పార్టీని డ్యామేజ్‌ చేసుకుంటారనే నానుడి ఉండేది. కానీ ప్రస్తుతం హస్తం పార్టీలో టీమ్‌ స్పిరిట్ కనిపిస్తోంది. సీఎం రేవంత్ పాలనకు మంత్రులు, పార్టీ లీడర్లు పూర్తిగా సహకారాలు అందిస్తున్నారు. సీఎంకు నల్గొండ, ఖమ్మం నేతల రూపంలో పక్కనే బాంబ్‌లు ఉన్నాయని చాలాసార్లు ప్రతిపక్షాల లీడర్లు కామెంట్స్ చేశారు. కానీ ప్రాక్టికల్‌ గా చూస్తే.. ఈ లీడర్ల నుంచి సీఎంకు మద్దతు లభిస్తోంది. పార్టీని, ప్రభుత్వాన్ని పెద్దగా ఇబ్బంది పెట్టే చర్యలేవి తీసుకోవడం లేదు. వ్యతిగత ప్రయోజనాల కన్నా.. పార్టీ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నట్టు తెలుస్తోంది. కళ్లల్లో కట్టెలు వేసే విధంగా కాకుండా.. ప్రభుత్వ పెద్దలకు సహకరిస్తూ పాలనపై ఫోకస్ పెట్టేలా ప్రొత్సాహం ఇస్తున్నారు. విభేదాలతో పార్టీని డ్యామేజ్ చేసేలా... ప్రతిపక్షాలకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తపడుతున్నారు. చూడాలి మరి ఈ సహకారం ఎప్పటి వరకు ఇలా ఉంటుందో.

Show Full Article
Print Article
Next Story
More Stories