Congress MLA Candidates List: కాంగ్రెస్ మొదటి జాబితా ఖరారు.. అభ్యర్థులు వీరే?

Congress MLA Candidates List: కాంగ్రెస్ మొదటి జాబితా ఖరారు.. అభ్యర్థులు వీరే?
x
Highlights

TS Congress First List Candidates:

TS Congress First List Candidates: ఈ సారి తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికలకు అభ్యర్ధులను సమాయత్తం చేయాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే పావులు కదుపుతోంది. కర్ణాటక ఎన్నికల జోష్‌ను తెలంగాణలోనూ కంటిన్యూ చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ అభ్యర్ధుల తొలి జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

తొలి జాబితాపై కసరత్తు పూర్తి చేసిన రాష్ట్ర నేతలు జాతీయ నాయకత్వానికి పంపినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ జాబితాకు హైకమాండ్ ఆమోదం తెలిపితే త్వరలోనే అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల ప్రణాళికలో భాగంగా అగ్రనాయకులతో తెలంగాణలో సభలు, సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన అధినాకత్వం.. ఆ కార్యక్రమాల్లో అభ్యర్ధులతోనే ఫోకస్ చేయడం ద్వారా ప్రజల్లోని బలంగా వెళ్లాలని వ్యూహరచన చేస్తోంది. ప్రచారంలో దూసుకుపోవడం ద్వారా అధికార బీఆర్ఎస్‌కు చెక్ పెట్టాలని కాంగ్రెస్ అధినాయకత్వం యోచిస్తోంది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హీట్ కొనసాగుతోంది. ఎన్నికలకు మూడు నెలలు ముందే బీఆర్ఎస్ పార్టీ ఏకంగా అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ పార్టీ.. టిక్కెట్ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ దరఖాస్తుల ప్రక్రియ రేపటితో పూర్తికావడంతో.. వీరిలో నుంచి కొందరు అభ్యర్ధులను ఎంపిక చేసి, తొలి జాబితాను ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది.

కొడంగల్ - రేవంత్ రెడ్డి, మధిర - భట్టి విక్రమార్క

హుజూర్ నగర్ - ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, నల్లగొండ -కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ములుగు - సీతక్క, నాగార్జున సాగర్ - జానారెడ్డి కుటుంబం

కొత్తగూడెం - పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కామారెడ్డి - షబ్బీర్ అలీ

కొల్లాపూర్ - జూపల్లి కృష్ణారావు

సంగారెడ్డి - జగ్గారెడ్డి, జగిత్యాల- జీవన్ రెడ్డి

కోదాడ - ఉత్తమ్‌ పద్మావతి, ఆందోల్ - దామోదర రాజనర్సింహా

వరంగల్ తూర్పు - కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ- నాయిని రాజేందర్ రెడ్డి

జహీరాబాద్ - ఏ.చంద్రశేఖర్, ఇబ్రహీంపట్నం - మల్ రెడ్డి రంగారెడ్డి

మంథని- శ్రీధర్ బాబు, భూపాలపల్లి - గండ్ర సత్యనారాయణ

కల్వకుర్తి -వంశీ చంద్‌ రెడ్డి, అలంపూర్ - సంపత్ కుమార్

నర్సాపూర్ - గాలి అనిల్ కుమార్‌, దేవరకొండ - బాలు నాయక్

వనపర్తి- చిన్నారెడ్డి, భద్రాచలం - పొడెం వీరయ్య,

నర్సంపేట -దొంతి మాధవరెడ్డి, నాగర్ కర్నూల్ - కుచుకుళ్ళ రాజేష్ రెడ్డి

అచ్చంపేట - వంశీ కృష్ణ, షాద్‌నగర్ - ఈర్లపల్లి శంకర్

ఆదిలాబాద్ - కంది శ్రీనివాస్ రెడ్డి, నిర్మల్ - శ్రీహరి రావు

మంచిర్యాల - ప్రేమ్ సాగర్ రావు, బెల్లంపల్లి - గడ్డం వినోద్ కుమార్

జుక్కల్ - గంగారాం, నిజామాబాద్ అర్బన్ - మహేష్ కుమార్‌ గౌడ్

బాల్కొండ - సునీల్ రెడ్డి, వికారాబాద్ - గడ్డం ప్రసాద్ కుమార్

పరిగి - రామ్మోహన్ రెడ్డి, వేములవాడ- ఆది శ్రీనివాస్

హుస్నాబాద్- ప్రవీణ్ రెడ్డి/ పొన్నం ప్రభాకర్, హుజురాబాద్- బాల్ముర్ వెంకట్

చొప్పదండి - మేడిపల్లి సత్యం, మానకొండూరు- కౌవ్వంపల్లి సత్యనారాయణ

రామగుండం - రాజ్ ఠాకూర్, మేడ్చల్- తోటకూర వజ్రేష్ యాదవ్

పెద్దపల్లి - విజయ రమణా రావు, ధర్మపురి - లక్ష్మణ్

కోరుట్ల - జువ్వాడి నర్సింగ్ రావు, ముషీరాబాద్ - అనిల్ కుమార్ యాదవ్

జూబ్లీహిల్స్ - విష్ణువర్థన్ రెడ్డి, నాంపల్లి - ఫిరోజ్ ఖాన్

ఖైరతాబాద్ - రోహిన్ రెడ్డి, సనత్ నగర్ - కోటా నీలిమ

LBనగర్ -మల్‌రెడ్డి రామారెడ్డి (లేదా) మధుయాష్కిగౌడ్

శేరిలింగంపల్లి -రఘునాథ్ యాదవ్, కంటోన్మెంట్- శ్రీగణేష్

Show Full Article
Print Article
Next Story
More Stories