కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో విజయశాంతి భేటీ

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో విజయశాంతి భేటీ
x
Highlights

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ప్రముఖ బిల్డర్ నివాసంలో కిషన్‌రెడ్డితో రహస్యంగా సమావేశమైన విజయశాంతి కీలక చర్చలు జరిపారు.

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ప్రముఖ బిల్డర్ నివాసంలో కిషన్‌రెడ్డితో రహస్యంగా సమావేశమైన విజయశాంతి కీలక చర్చలు జరిపారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా ఉన్న విజయశాంతి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో సమావేశం కావడంతో ఊహాగానాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా రాములమ్మ బీజేపీలో చేరబోతుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే, బీజేపీ వర్గాలు మాత్రం ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని అంటున్నారు. మరోవైపు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్న విజయశాంతి.... ఎవరికీ అందుబాటులోకి రావడం లేదని చెబుతున్నారు. అయితే, కిషన్‌రెడ్డితో సమావేశం కావడంతో రాములమ్మ త్వరలోనే కాషాయం గూటికి చేరడం ఖాయమనే మాట వినిపిస్తోంది.

కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తిలో ఉన్న విజయశాంతి కొద్దిరోజులుగా టీకాంగ్రెస్‌ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే, డీకే అరుణ బీజేపీ జాతీయ ఉపాధ‌్యక్షురాలైన తర్వాత.... విజయశాంతి చూపు బీజేపీ వైపు మళ్లిందని అంటున్నారు. డీకే అరుణకు బీజేపీ హైకమాండ్‌ అత్యంత ప్రాధాన్యత కలిగిన పదవిని ఇవ్వడంతో.... కాషాయం గూటికి చేరేందుకు రాములమ్మ పావులు కదిపారని చెబుతున్నారు. డీకే అరుణతో ఉన్న సాన్నిహిత్యంతో విజయశాంతి ఆమెతో టచ్‌లో ఉంటున్నారని, బీజేపీలో చేరడానికి చర్చలు సైతం చర్చలు జరిపారని అంటున్నారు. అన్నీ కుదిరితే త్వరలోనే అమిత్‌‌షా సమక్షంలో విజయశాంతి కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories