Congress: ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ కీలక సమావేశం

Congress: ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ కీలక సమావేశం
x

Congress: ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ కీలక సమావేశం

Highlights

Congress: ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు.

Congress: ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు తెలంగాణ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి రాహుల్, కేసి వేణుగోపాల్, తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా హాజరయ్యారు. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులపై ఏఐసీసీ సమీక్ష నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై ఏఐసీసీ సమీక్ష నిర్వహిస్తోంది.

ఈ సమావేశంలో తెలంగాణలో పార్టీ పరిస్థితులు, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, రాజ్యసభ సభ్యుల ఎంపిక, రెండేళ్ల ప్రభుత్వ పనితీరుపై చర్చించనున్నారు. దీంతో పాటు మంత్రుల మధ్య విభేదాలు, సీనియర్ నేతల విభేదాలపై కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, కార్పొరేషన్ చైర్మన్లు, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ల అంశంపై.. అధిష్టానంతో సీఎం రేవంత్ చర్చించే అవకాశం ఉంది. మరోవైపు, దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన కాంగ్రెస్ అధిష్టానం.. ఇప్పటికే 11 రాష్ట్రాలపై సమీక్ష జరిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories