మునుగోడు ఉపఎన్నికపై కాంగ్రెస్‌ ఫోకస్‌

Telangana Congress focus on Munugodu By-Election | TS News
x

మునుగోడు ఉపఎన్నికపై కాంగ్రెస్‌ ఫోకస్‌ 

Highlights

మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి ఖరారు కావడంతో ప్రచారంపై దృష్టి

Telangana Congress: మునుగోడు ఉపఎన్నికపై కాంగ్రెస్‌ ఫోకస్‌ పెట్టింది. ఎలాగైనా ఆ స్థానంలో గెలవాలని పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా.. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ భేటీకి పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో పాటు ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, సంపత్‌, దామోదర రాజనర్సింహ, చెరుకు సుధాకర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు మహేష్‌కుమార్‌ గౌడ్‌, అంజనీకుమార్‌ యాదవ్‌, బలరాం నాయక్‌ హాజరయ్యారు. ఇప్పటికే మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి ఖరారు కావడంతో ప్రచారంపై ప్రధానంగా దృష్టిసారించారు టీకాంగ్‌ నేతలు. ఆశావహులతో మాట్లాడిన పీసీసీ చీఫ్‌.. అందరూ కలిసి మునుగోడు విజయం కోసం పనిచేయాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories