Padmashali Mahasabha: పద్మశాలీలకు ఈ రేవంత్ రెడ్డి ఇస్తున్న హామీ ఇదే

Telangana CM Revanth Reddy speech in all india padmashali mahasabha
x

Padmashali Mahasabha: పద్మశాలీలకు రేవంత్ రెడ్డి ఇస్తున్న హామీ ఇదే

Highlights

Revanth Reddy speech in Padmashali mahasabha: పద్మశాలీ సోదర, సోదరీమణులు అన్ని రంగాల్లో ఎదగాలని ఆశిస్తున్నట్లు రేవంత్ రెడ్డి

Revanth Reddy speech in Padmashali Mahasabha: తెలంగాణలో ప్రభుత్వం రైతన్నలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో నేతన్నలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన అఖిల భారత పద్మశాలీల మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నేతన్నలను ఉద్దేశించి మాట్లాడారు. గత ప్రభుత్వంలో పద్మశాలీలకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. కేసీఆర్ పద్మశాలీలను ఎదగనివ్వలేదని ఆరోపించారు. పద్మశాలీలకు కనీసం బతుకమ్మ చీరల బిల్లులు కూడా ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారని గుర్తుచేశారు.

పద్మశాలీలను ప్రోత్సహిస్తూ వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 1.30 కోట్ల చీరలు నేసే ఆర్డర్ ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆలె నరేంద్ర లాంటి నాయకులకు కేసీఆర్ అన్యాయం చేశారని ఆరోపించారు. అంతేకాదు.. కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే ఆయన్ను కడసారి చూసేందుకు కూడా వెళ్లలేదు. కానీ తమ ప్రభుత్వం టెక్స్ టైల్ యూనివర్శిటీ ఏర్పాటు చేసి దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టామని అన్నారు. ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ పేరే పెడతామని ప్రకటించారు.

ఒక ప్రణాళికతో నా దగ్గరికి రండి

పద్మశాలీ సోదర సోదరీమణులు అంతా ఏకమై అన్ని రంగాల్లో ఎదగాలని కోరుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. మీకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని మాటిచ్చారు. పద్మశాలీ సామాజిక వర్గంలో మేధావులతో ఒక కమిటీ ఏర్పాటు చేసుకోండి. పద్మశాలిల అభివృద్ధి, పిల్లల చదువులు, ఉద్యోగాలు, నైపుణ్యం పెంపు వంటి అంశాలపై ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. అందుకోసం మీ సామాజికవర్గంలోనే ఐఏఎస్‌లను, బాగా చదువుకున్న వారిని సంప్రదించి వారి ఆలోచనలు తీసుకోండి. అంతా ఏకమై ఒక ప్రణాళికతో వస్తే ప్రభుత్వం తరపున మీ కోసం ఏం చేయాలో అది చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

షోలాపూర్ లో నేతన్నల సంఖ్య అధికంగా ఉంది. అక్కడ ప్రచారం కోసం ఆహ్వానించిన నేతన్నలు తనను మార్కండేయ భవన్ కు తీసుకెళ్లారు. షోలాపూర్ నియోజకవర్గం పరిధిలో ఏ నేత గెలవాలన్నా మన తెలంగాణ నుండి అక్కడికి ఎప్పుడో వలస వెళ్లిపోయిన నేతన్నల ఓట్లే ముఖ్యమన్నారు. షోలాపూర్ లో ఉన్న మన తెలుగు నేతన్నలు తమకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలని అడిగారు. వారి కోరిక మేరకు షోలాపూర్ లో నేతన్నలకు అవసరమైన భవనం నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల నిధులను ఇస్తుందని ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories