గొప్ప మనసు చాటుకున్న సీఎం కేసీఆర్ సతీమణి శోభా

గొప్ప మనసు చాటుకున్న సీఎం కేసీఆర్ సతీమణి శోభా
x
Highlights

ఓ కుటుంబ ధీనస్థితిని మీడియా ద్వారా చూసి సీఎం కేసీఆర్ సతీమణి శోభా చలించిపోయారు. అన్ని కోల్పోయిన ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి వెంటనే లక్ష రూపాయాలు పంపించారు.

ఓ కుటుంబ ధీనస్థితిని మీడియా ద్వారా చూసి సీఎం కేసీఆర్ సతీమణి శోభా చలించిపోయారు. అన్ని కోల్పోయిన ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి వెంటనే లక్ష రూపాయాలు పంపించారు. స్థానిక ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌కు వెంటనే కాల్ చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని సూచించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన తిరుపతి అనారోగ్యంతో చనిపోయారు. దీంతో ఆయన భార్య, ఇద్దరు పిల్లలు, వృద్ధ తల్లిదండ్రులు రోడ్డునపడ్డారు. నిల్వనీడలేక కులసంఘం భవనంలో తలదాచుకుంటున్నారు.

పెద్ద దిక్కును కోల్పోయి కష్టల్లో పడిన కుటుంబానికి సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ తక్షణ సాయంగా లక్ష రూపాయలు పంపించారు. ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ బాధిత కుటుంబాన్ని కలిసి, శోభమ్మ ఇచ్చిన లక్ష రూపాయాలు. దాతల నుంచి సేకరించిన మరో 2లక్షల రూపాయాలను అందజేశారు. బాధిత కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేస్తామని, వారి పిల్లలను గురుకుల పాఠశాలలో చదివిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories