సోమవారం సూర్యపేట్ కు సిఎం కేసీఆర్...

సోమవారం సూర్యపేట్ కు సిఎం కేసీఆర్...
x
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం సూర్యాపేట వెళ్లనున్నారు. దేశ రక్షణ కోసం పోరాటం చేసి అసువులు బాసిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యుల్ని సీఎం పరామర్శిస్తారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం సూర్యాపేట వెళ్లనున్నారు. దేశ రక్షణ కోసం పోరాటం చేసి అసువులు బాసిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యుల్ని సీఎం పరామర్శిస్తారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు రూ.5 కోట్ల పరిహారాన్ని చెక్కు రూపంలో, అదే విధంగా ఇంటి స్థలం పట్టాను సీఎం స్వయంగా అందజేయనున్నారు. ఇప్పటికే మంత్రి జగదీశ్ రెడ్డి ఆయన సతీమని సంతోష్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంతోష్ బాబు కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆయన సీఎం అందజేస్తానన్న సాయాన్ని తీసుకోవడానికి వారు అంగీకరించారని స్పష్టం చేసారు.

సంతోష్ బాబు సేవలకు గుర్తుగా, యువతకు స్పూర్తిగా ఉండాలని కేసీఅర్ భావిస్తున్నారని ఆయన తెలిపారు. వారి కుటుంబానికి ప్రభుత్వం తరుపున సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. భవిష్యత్ లో కుటుంబ అవసరాల రీత్యా 5కోట్ల నగదు, ఇంటి జాగా ఇవ్వాలని కేసీఆర్ ప్రకటించారన్నారు. అదే విధంగా గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని, అది కూడా ఆసక్తి ఉన్న ఉద్యోగం ఇవ్వాలనే కేసీఆర్ ఆలోచించారని తెలిపారు. ప్రభుత్వ సాయంపై వ్యక్తిగతంగా కుటుంబాన్ని కలిసి చెప్పమన్నారన్నారు. ప్రభుత్వ సాయాన్ని వారు సంతోషంగా ఒప్పుకున్నారని మంత్రి తెలిపారు. తమతో పాటు దేశంలోని ఇతర సైనికులకు సాయం చేయడాన్ని అభినందించారు. కొడుకు పోయిన బాధ కంటే దేశం కోసం చనిపోయాడని వాళ్ళు చెప్పడం వారి గొప్పదనానికి నిదర్శనం అని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం స్వయంగా సూర్యపేటలోని కల్నల్ సంతోష్ బాబు నివాసానికి వస్తారని ఆయన తెలిపారు. కేసీఆర్ రాకపైన సంతోష్ బాబు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాము అని మంత్రి తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories