కేసీఆర్ చేతకాని తనం వల్లే గాంధీ హాస్పిటల్లో డాక్టర్లపై దాడులు జరుగుతున్నాయి : బండి సంజయ్

కేసీఆర్ చేతకాని తనం వల్లే గాంధీ హాస్పిటల్లో డాక్టర్లపై దాడులు జరుగుతున్నాయి : బండి సంజయ్
x
బండి సంజయ్ ఫైల్ పోటో
Highlights

కేంద్రం నిధులను జేబులు నింపు కోవడమే కేసీఆర్ లక్ష్యంగా కనిపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సీఎంపై ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని...

కేంద్రం నిధులను జేబులు నింపు కోవడమే కేసీఆర్ లక్ష్యంగా కనిపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సీఎంపై ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్ బీజేపీ కార్యాలయం నుంచి గురువారం మొదలైన 'ఇంటింటికి మోదీ సందేశం' కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మోదీ పాలన ఏడాది పూర్తయి రెండో విడతలో అగుడుపెడుతున్న సందర్భంగా ప్రధాని దేశ ప్రజలకు రాసిన లేఖను వివరించేందుకు రాష్ట్ర బీజేపీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.వందల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ఇస్తే ఆ నిధులను సీఎం పక్క దోవ పట్టించారని ఆరోపించారు. రాష్ట్రంలో సీఎం చేస్తున్న ప్రజలను మభ్యపెట్టి, ఆయన తప్పులను కప్పి పుచ్చుకోవడానికి కేంద్రంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ దౌర్భాగ్యపు సీఎం అని బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ల అభివృద్ధి చేయడానికి కేంద్రం ఇచ్చిన నిధులనే ఉపయోగించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది కోసం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని వివరించారు. అంతే కాకుండా గ్రామ పంచాయతీలను అభివృద్ది చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఖర్చు చేయలేదని అప్పుడు కూడా కేంద్రం ఇచ్చిన 14వ ఆర్థిక సంఘం నిధులనే ఉపయోగించారని తెలిపారు. వివరించారు.

రాష్ట్రంలో ఒక్క సారిగా విజృంభించిన కరోనాను కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చెంత అని ప్రశ్నించారు. కేసీఆర్ చేతకాని తనం వల్లే గాంధీ హాస్పిటల్లో డాక్టర్లపై దాడులు జరుగుతున్నాయని, వైద్యులు ఆందోళన చేస్తుంటే వారిని సర్కారు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం పనితీరు ఎలా ఉందో గాంధీ హాస్పిటల్‌కు వెళ్తే తెలుస్తుందని అన్నారు. దేశంలో కరోనాను కట్టడి చేయడానికి కేంద్రం లాక్ డౌన్‌ విధించిందని, దాంతోనే మర్కజ్ వెళ్లొచ్చిన వారిని బయటకు తిరగకుండా కట్టడి చేయగలిగామని గర్తు చేశారు. లేదంటూ వారు బయట తిరిగితే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకుంటేనే భయమేస్తుందని చెప్పారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories