కర్ణాటక సీఎం కుమారస్వామికి కేసీఆర్‌ ఫోన్‌

కర్ణాటక సీఎం కుమారస్వామికి కేసీఆర్‌ ఫోన్‌
x
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస‍్వామితో ఫోన్‌లో మాట్లాడారు. జూరాలకు నీటి విడుదలపై ఆయన ఈ సందర్భంగా కర్ణాటక...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస‍్వామితో ఫోన్‌లో మాట్లాడారు. జూరాలకు నీటి విడుదలపై ఆయన ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రితో చర్చించినట్టు తెలుస్తోంది. జూరాల ప్రాజెక్టుకు మూడు టీఎంసీల నీటిని విడుదల చేయాలని కేసీఆర్‌ కోరినట్టు సమాచారం. దీనిపై సానుకూలంగా స్పందించిన కుమారస్వామి అధికారులతో చర్చించి నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ కు చెప్పారు. కాగా జూరాలపై ఆధారపడ్డ పాలమూరు గ్రామాలకు తాగునీటి కోసం కేసీఆర్ ఈ ఫోన్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories