Top
logo

మరో మహా యాగానికి సీఎం కేసీఆర్ శ్రీకారం

మరో మహా యాగానికి సీఎం కేసీఆర్ శ్రీకారం
Highlights

మరో మహా యాగానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. యాదాద్రిలో మహా సుదర్శన యాగం నిర్వహణపై శ్రీ త్రిదండి చినజీయర్...

మరో మహా యాగానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. యాదాద్రిలో మహా సుదర్శన యాగం నిర్వహణపై శ్రీ త్రిదండి చినజీయర్ స్వామితో కేసీఆర్ చర్చించారు. వంద ఎకరాల స్థలంలో 1048 యజ్ఞ కుండాలు, 6వేలమంది రుత్వికులతో మహాయాగం జరుపనున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ మహా ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. త్వరలో యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహాస్వామి క్షేత్రంలో మహాసుదర్శన యాగం నిర్వహించాలని నిర్ణయించారు. ఈమేరకు యాగం నిర్వహ‍ణ ఏర్పాట్లు ఏవిధంగా ఉండాలి...? ఏవిధంగా ఈ కార్యక్రమాన్ని మహాఅద్భుతమైన కార్యక్రమంగా నిర్వహించాలని కూడా త్రిదండి చినజీయర్ స్వామితో చర్చోప చర్చలు చేసినట్లు తెలిసింది. దాదాపు దేశంలోనే ఎవరూ చేయనంత మహా కార్యక్రమం చేసే లక్ష్యంతో ముందడుగు వేశారు.

మహాసుదర్శన యాగం అనేది చాలా అరుదుగా... రమణీయంగా చేయాల్సిన అవసరం ఉందని కేసీఆర్ భావిస్తున్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రం కన్నుల పండువగా నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో అదే మేరకు ఓ బ్రహ్మాండమైన మహాసుదర్శన యాగం చేసినట్లయితే బాగుందని అనుకున్నారు. దాదాపు వంద ఎకరాల్లో యజ్న వాటికలో 1048 యజ్నకుండాలతో సుదర్శన యాగం నిర్వహిస్తారు. దాదాపు 6వేల మంది రుత్వికులతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

మహాసుదర్శన యాగానికి దేశంలో ఉన్నటువంటి వైష్ణవ పీఠాధిపతులందరిని కూడా ఆహ్వానించనున్నారు. బధ్రినాథ్, శ్రీరంగం, జగన్నాథ్, తిరుపతి నుంచి మఠాధిపతులను ఆహ్వానించనున్నారు. కేంద్రం, రాష్ట్రాల పెద్దలు, ఆయా రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులను యాగానికి కేసీఆర్ ఆహ్వానించనున్నారు. లక్షల మంది హాజరయ్యే మహా సుదర్శన యాగానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ... భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసే అంశంపై చినజీయర్ స్వామితో కేసీఆర్ చర్చించారు. ఆగస్టులో మంచిరోజులు ఉండటంతో ఆగస్టులో చేద్దామా... లేక ఎప్పుడు చేద్దామని... వైష్ణవఆచారాల ప్రకారం ఏ రోజు అయితే బాగుంటుందని.. తిథులు, నక్షాల పరంగా చేయాలన్న అంశంపై చర్చించారు.

Next Story

లైవ్ టీవి


Share it