logo
తెలంగాణ

ఉత్తరాది రాష్ట్రాల పర్యటనలో సీఎం కేసీఆర్...

Telangana CM KCR North States Tour | KCR Live News
X

ఉత్తరాది రాష్ట్రాల పర్యటనలో సీఎం కేసీఆర్...

Highlights

KCR: రైతు సమస్యలకు పరిష్కారం దొరక్కపోవడం దౌర్భాగ్యం - కేసీఆర్

KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ ఉత్తరాది పర్యటనలో భాగంగా ఢిల్లీ, పంజాబ్ లో పర్యటించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో కలిసి చండీగడ్ వెళ్లారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో భేటీ అయ్యారు. ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు కలిశారు. ముందుగా గల్వాన్ లోయలో అమరులైన భారత సైనికుల కుటుంబాలకు , రైతు ఉద్యమంలో మరణించిన రైతు రైతులకు శ్రద్దాంజలి ఘటించారు. గాల్వన్ లోయలో అమరులైన వారిలో పంజాబ్ నుంచి నలుగురు సైనికులు ఉండగా వారి కుటుంబాలకు పది లక్షల చొప్పున ఆర్ధిక సహాయం అందించారు. ఇక రైతులతో పాటు సైనిక కుటుంబాలకు చెక్కులను అందించారు.

దేశంలో ఎక్కడా లేని సమస్యలు మన దేశంలోనే ఉన్నాయని.. ఇలాంటి సమావేశాలు పెట్టుకోవాల్సి రావడం బాధాకరమన్నారు. 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా దేశం పరిస్థితి మారలేదన్నారు. సాగు చట్టాలపై పోరాడిన రైతులకు పాదాబివందనాలు చేస్తున్నట్లు చెప్పారు. గాల్వాన్ లో చైనాతో జరిగిన పోరాటంలో మరణించిన సైనిక కుటుంబాలను కలువలేకపోయానని కేసీఆర్ భావోద్వేగంతో చెప్పారు. దేశంలోని రైతు సంఘాలన్ని సంఘటితం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు సీఎం కేసీఆర్. చంఢీగ్ వేదికగా మరో రైతు ఉద్యమానికి పిలుపునిచ్చారు.

చండీగఢ్ వచ్చిన సీఎం కేసీఆర్ కు ఘనస్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ వెంట రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, రంజిత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ సహా పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.

దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు యావద్దేశం అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం బాధాకరమని, ఇంత మంది రైతుల బలిదానాలు చూస్తుంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయని కేసీఆర్ భావోద్వేగంతో అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ఇలాంటి సభలు జరుపుకోవాల్సిన అగత్యం పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి కారణమేంటో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని, ఇందుకు దారితీసిన పరిస్థితులపై ప్రజల్లో చర్చ జరగాలని కేసీఆర్ అన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు పోరాటాలు చేయడం, జీవితాలు త్యాగాలు చేయాల్సిన నిస్సహాయతకు కారణమేంటని ప్రశ్నించారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ సమస్యలున్నాయని, కానీ భారతదేశంలో ఉన్నన్ని సమస్యలు మరెక్కడా లేవని అన్నారు. "కేంద్రప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు తలవంచి నమస్కరిస్తున్నాను. పోయినవారిని తిరిగి తీసుకురాలేం. కానీ కేజ్రివాల్, భగవంత్ మాన్ చెప్పిన్నట్లు మీరు ఒంటరి కాదనీ, యావద్దేశం మీతో ఉన్నదని సానుభూతిని ప్రకటించే ప్రజలైతే ఉన్నారు." అంటూ రైతుల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు.

దేశంలోని రైతు సంఘాలన్నీ సంఘటితం కావాల్సిన సమయం ఆసన్నమైందని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే. చంద్రశేఖర రావు అన్నారు. ఆదివారం చండీగఢ్ వేదికగా ఆయన మరో రైతు ఉద్యమానికి పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సాగిన రైతు ఉద్యమంలో అసువులుబాసిన రైతు కుటుంబాలతో పాటు గాల్వాన్ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో అమరులైన సైనికుల కుటుంబాలకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్‌తో కలిసి చండీగఢ్‌లోని టాగోర్ థియేటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమరజవాన్ల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున నాలుగు కుటుంబాలకు చెక్కులను అందజేశారు. అలాగే పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన సుమారు 600 మంది రైతుల కుటుంబాలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఒక్కో కుటుంబానికి రూ. 3 లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు యావద్దేశం అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం బాధాకరమని, ఇంత మంది రైతుల బలిదానాలు చూస్తుంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయని కేసీఆర్ భావోద్వేగంతో అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ఇలాంటి సభలు జరుపుకోవాల్సిన అగత్యం పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి కారణమేంటో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని, ఇందుకు దారితీసిన పరిస్థితులపై ప్రజల్లో చర్చ జరగాలని కేసీఆర్ అన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు పోరాటాలు చేయడం, జీవితాలు త్యాగాలు చేయాల్సిన నిస్సహాయతకు కారణమేంటని ప్రశ్నించారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ సమస్యలున్నాయని, కానీ భారతదేశంలో ఉన్నన్ని సమస్యలు మరెక్కడా లేవని అన్నారు. "కేంద్రప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు తలవంచి నమస్కరిస్తున్నాను. పోయినవారిని తిరిగి తీసుకురాలేం. కానీ కేజ్రివాల్, భగవంత్ మాన్ చెప్పిన్నట్లు మీరు ఒంటరి కాదనీ, యావద్దేశం మీతో ఉన్నదని సానుభూతిని ప్రకటించే ప్రజలైతే ఉన్నారు." అంటూ రైతుల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు.

దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప యోధున్ని కన్న రాష్ట్రం పంజాబ్ అని, ఈ గొప్ప నేల దేశం కోసం మహత్తరమైన భాగస్వామ్యాన్ని అందించిందని కేసీఆర్ అన్నారు. "స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన వీరులను కన్న పంజాబ్ ను దేశం ఎప్పుడూ మరిచిపోదు. అలాగే దేశం ఆహారం కోసం పరితపిస్తున్నప్పుడు ఇక్కడి రైతులు చెమటోడ్చి మొట్టమొదటిసారిగా హరిత విప్లవాన్ని సృష్టించి దేశానికి అన్నం పెట్టారు. ఇదేం చిన్న విషయం కాదు. వారు గొప్ప పాత్ర పోషించారు. భారతదేశ చరిత్రలో ఈ విషయం స్వర్ణాక్షరాలతో లిఖించి ఉంటుంది" అంటూ పంజాబ్ రైతులను, ప్రజలను కేసీఆర్ కొనియాడారు. గాల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో తెలంగాణ రాష్ట్రవాసి కల్నల్ సంతోష్ బాబుతో పాటు పంజాబ్ సైనికులు కూడా అమరులయ్యారని, తాను అప్పుడే పంజాబ్ కు వచ్చి అమరులైన వారి కుటుంబాలను ఆదుకుందామని అనుకున్నప్పటికీ, ఇక్కడ ఎన్నికలు జరుగుతుండడం వల్ల కోడ్ అడ్డమొచ్చి రాలేకపోయానని తెలిపారు. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు అరవింద్ కేజ్రివాల్‌ను ఈ విషయంపై సంప్రదించగా ఆయన ఈ కార్యక్రమాన్ని మెచ్చుకుంటూ ముందుకొచ్చారని కేసీఆర్ తెలిపారు. మనందరం కలిసి రైతు కుటుంబాల దుఃఖాన్ని తొలగించే ప్రయత్నం చేద్దామంటూ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్‌లను ఉద్దేశించి అన్నారు.

ప్రజల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వాలు తమవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేదని, రోజుకు 10 నుంచి 20 మంది రైతులు ఆత్మహత్య చేసుకునేవారని కేసీఆర్ అన్నారు. రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొనేవారని, విద్యుత్ కొరత తీవ్రంగా ఉండేదని, కరెంటు ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలిసేది కాదని గుర్తుచేశారు. రాత్రి వ్యవసాయ మోటర్లు వేసేందుకు పోతే పాములు కుట్టి చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయన్నారు. ఈ బాధలు వినేవాళ్ళే లేకపోయారని, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ సమస్యను అధిగమించామని, అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మీటర్లు పెట్టి లెక్కలు వేయాలంటోందని, తద్వారా రక్తం పీల్చమంటోందని విమర్శించారు. అసెంబ్లీ వేదికగా ప్రాణం పోయినా తాము మీటర్లు పెట్టబోమంటూ తేల్చి చెప్పామని గుర్తుచేశారు. రైతుల సంక్షేమం కోసం మాట్లాడే ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులంటే బీజేపీకి నచ్చదని, రైతు ఉద్యమ సమయంలో రైతులను ఖలిస్తానీలని, దేశ ద్రోహులని నిందించారని కేసీఆర్ గుర్తుచేశారు. కానీ మొక్కవోని దీక్షతో రైతులు ఉద్యమాన్ని కొనసాగించారని, ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగించాలని తాను రైతు నాయకులను కోరుతున్నానని కేసీఆర్ తెలిపారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచే కాదు, దేశంలోని అన్ని మూలల నుంచి ఉద్యమం జరగాలని పిలుపునిచ్చారు. దేశానికి, ప్రపంచానికి ఆహారం అందించే రైతులకు న్యాయం దక్కాలని, అది వారి హక్కు అని వ్యాఖ్యానించారు. ఉద్యమాలు చేసే వాతావరణం పోవాలని అభిలషించారు.

రైతులు తలుచుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయని కేసీఆర్ అన్నారు. రైతులు పండించిన పంట విలువకు రాజ్యాంగపరమైన రక్షణ లభించేదాకా పోరాటం ఆపకూడదని సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఈ అంశానికి కట్టుబడి ఉంటుందో ఆ పార్టీకి రైతులంతా కలిసి మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. అప్పుడే రైతు పండించిన పంటకు చట్టబద్ధత లభిస్తుందని అన్నారు. రైతు పక్షపాత రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా ఏకమవుతాయని, ప్పటినుంచి నడిచే ఉద్యమాలకు తాము కూడా తోడుగా ఉంటామని స్పష్టం చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో నడిచిన రైతు ఉద్యమానికి కేజ్రివాల్ తమవంతు సహాయం చేశారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం రైతుల డిమాండ్ లను తీర్చే వరకు పోరాటానికి సంపూర్ణ మద్దతునిస్తామని తెలిపారు.

చండీగఢ్ గులాబీ మయం కేసీఆర్‌కు ఘన స్వాగతం..

రైతులు, సైనిక కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసేందుకు చండీగఢ్ వచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం లభించింది. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో విందు సమావేశం అనంతరం ముఖ్యమంత్రులిద్దరూ కలిసి ప్రత్యేక విమానంలో చండీగఢ్ చేరుకోగా.. అప్పటికే నగరం గులాబీ రంగు ఫ్లెక్సీలు, పోస్టర్లతో సిద్ధంగా ఉంది. చెక్కుల పంపిణీ కోసం సిద్ధం చేసిన టాగోర్ థియేటర్ కేసీఆర్‌కు, ఆయన వెంట వచ్చిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు నామ నాగేశ్వర రావు, రంజిత్ రెడ్డిలకు సాదర స్వాగతం లభించింది. ఈ కార్యక్రమం కోసం పంజాబ్ ప్రభుత్వ అధికారులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ సహా పలువురు ఉన్నతాధికారులు ముందే చండీగఢ్ చేరుకుని ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రులు చేరుకునే వరకు థియేటర్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిపై పంజాబీ భాషలో రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ప్రదర్శించారు. ముఖ్యమంత్రులు వేదిక మీదకు చేరుకున్న తర్వాత రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతు కుటుంబాలు, గల్వాన్ లోయ ఘటనలో అమరులైన సైనికుల కుటుంబాలకు శ్రద్ధాంజలి ఘటించారు.

కేసీఆర్ కు ఆప్ ముఖ్యమంత్రుల ప్రశంసలు..

రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్ ప్రశంసించారు. అమరులైన రైతుల కుటుంబాలకు ఇలా చెక్కులు పంపిణీ చేయాల్సిరావడం బాధాకరమైన సందర్భమని, వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతులు చేసిన పోరాటం గొప్పదని పంజాబ్ సీఎం అన్నారు. ఎండ, వాన, చలిని సైతం లెక్కచేయకుండా ఆందోళన కొనసాగించారని కొనియాడారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పారు. ఇది కేవలం ఒక వర్గానికో.. ఒక రాష్ట్రానికో సంబంధించిన ఆందోళన కాదని, మొత్తం దేశ రైతుల ఆందోళన అని అన్నారు. రైతులు ఢిల్లీకి వస్తే స్టేడియాలను జైళ్లుగా మార్చాలని తమకు కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయని, రైతుల ఉద్యమాన్ని అణిచివేయాలని చూసిందని కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. కేంద్ర వైఖరిపై తాము తీవ్ర్ అభ్యంతరం వ్యక్తం చేసి, రైతుల పక్షాన నిలిచామని గుర్తుచేశారు. ఢిల్లీ ప్రభుత్వం తరపున రైతులకు నీరు, భోజనం, మరుగుదొడ్ల ఏర్పాట్లు చేసామని చెప్పారు. రైతు బిడ్డ రైతు కావాలనుకోవడం లేదని, దేశంలో వ్యవసాయం పరిస్థితి అలా తయారైందని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాము రైతు బిడ్డలు రైతులుగానే ఉండాలనుకునేలా ఓ మోడల్ తయారు చేయబోతున్నామని, అది పంజాబ్ నుంచే మొదలవుతుందని కేజ్రీవాల్ తెలియజేశారు.

Web TitleTelangana CM KCR North States Tour | KCR Live News
Next Story