logo
తెలంగాణ

ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్‌.. మూడ్రోజులపాటు బిజీబిజీగా...

Telangana CM KCR Delhi Tour Meeting Delhi CM Arvind Kejriwal Today | Live News
X

ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్‌.. మూడ్రోజులపాటు బిజీబిజీగా...

Highlights

KCR - Delhi Tour: నేడు సీఎం కేజ్రీవాల్‌ను కలవనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌..

KCR - Delhi Tour: దేశ రాజకీయాల్లో కీలక పాత్ర చేపట్టేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ పూర్తి స్కెచ్‌తో రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే ము‌ఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీలో నేటి నుంచి మూడ్రోజులపాటు బిజీబిజీగా గడపనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కలుస్తారని తెలుస్తోంది. ఈమేరకు ఆయనతో ఓ సమావేశం కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇక మీటింగ్ తర్వాత ఢిల్లీ ఎయిమ్స్‌లో కేసీఆర్‌ హెల్త్‌ టెస్టులు చేయించుకోనున్నారు.

ఢిల్లీలో ఉండే ప్రాంతీయ పార్టీల అధినేతలను కూడా సీఎం కేసీఆర్‌ కలవనున్నట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాలవైపు అడుగులు వేస్తోన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఇప్పటికే ఎన్సీపీ చీఫ్‌ శరద్ పవార్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేను కలిశారు. అలాగే సినిమా నటుడు ప్రకాశ్‌ రాజ్‌ను కూడా కలిశారు. ఈమేరకు బీజేపీకి వ్యతిరేకంగా మద్దుతు ఇవ్వాలని కోరారు.

మూడ్రోరోజుల హస్తిన పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌, కేంద్ర మంత్రులతోనూ సమావేశమవుతారు. రాష్ట్ర విభజన హామీలతోపాటు పలు సమస్యలు, అలాగే తెలంగాణకు రావాల్సిన నిధులపై మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రధాని మోడీతో భేటీ అవుతారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

Web TitleTelangana CM KCR Delhi Tour Meeting Delhi CM Arvind Kejriwal Today | Live News
Next Story