CM KCR: ఢిల్లీకి సీఎం కేసీఆర్‌.. ట్రంప్‌ దంపతులకు కానుకలు

CM KCR: ఢిల్లీకి సీఎం కేసీఆర్‌.. ట్రంప్‌ దంపతులకు కానుకలు
x
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో హస్తినకు బయల్దేరనున్న కేసీఆర్,ఈ రాత్రికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ గౌరవార్ధం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇవ్వనున్న విందులో పాల్గొననున్నారు. ట్రంప్‌కు పోచంపల్లి శాలువా కప్పి చార్మినార్‌ మెమెంటో అందించనున్నారు. మెలానియా, ఇవాంకలకు పోచంపల్లి, గద్వాల చీరలను బహూకరించనున్నారు. ప్రధాని మోడీతోపాటు అతికొద్దిమంది కేంద్ర మంత్రులు, ఆరేడు మంది ముఖ్యమంత్రులకు మాత్రమే ఆహ్వానమున్న ఈ విందులో కేసీఆర్‌ కూడా పాలు పంచుకోనున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ గౌరవార్ధం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇవ్వనున్న విందులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గోనున్నారు. ప్రధాని నరేంద్రమోడీతోపాటు కేవలం 95మంది వీవీఐపీలు మాత్రమే పాల్గొనే ఈ విందులో కేవలం 8మంది ముఖ్యమంత్రులకు మాత్రమే ఆహ్వానం అందింది.

అసోం, హర్యానా, కర్నాటక, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ కలిపి మొత్తం 8మంది ముఖ్యమంత్రులకు రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానాలు అందాయి. ప్రధాని మోడీతోపాటు అతికొద్దిమంది కేంద్ర మంత్రులకు మాత్రమే ఆహ్వానమున్న అరుదైన ఈవెంట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలుపంచుకోనున్నారు.

రాష్ట్రపతి భవన్ ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ గౌరవార్ధం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇవ్వనున్న డిన్నర్‌ పార్టీలో పాల్గోనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories