కాంగ్రెస్ తో పీకే టచ్ లోకి వెళ్లడంతో స్పీడ్ తగ్గించిన కేసీఆర్...

Telangana CM KCR Back Step due to Prashant Kishor Working with Congress Opposite to BJP | Live News
x

కాంగ్రెస్ తో పీకే టచ్ లోకి వెళ్లడంతో స్పీడ్ తగ్గించిన కేసీఆర్...

Highlights

KCR: మోడీ మీద ఫైట్ చేసే ప్రణాళికలను పక్కన పెట్టిన సీఎం కేసీఆర్...

KCR: దేశ రాజకీయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు అనివార్యమంటూ ప్రకటించిన గులాబీ బాస్ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు అవసరమంటూ హడావిడి చేసిన కేసీఆర్.. ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది.

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని చెప్పిన కేసీఆర్ చివరకు రైతుల వద్ద మార్కులు కొట్టేసేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. ఇక మీదట వరి విషయంతో పాటు దేశ వ్యాప్తంగా మోడీ(Narendra Modi) విధానాలపై వ్యతిరేకంగా ఉన్న రైతు నేతలతో పాటు బీజేపేతర ముఖ్యమంత్రులతో భేటీ కావాలని నిర్ణయించారు. కానీ కాంగ్రెస్ తో పీకే(Prashant Kishor) టచ్ లోకి వెళ్లినట్లు వార్తలు రావడంతో కేసీఆర్ కాస్త స్పీడ్ తగ్గించారట..

పీకే బీజేపీ(Bharatiya Janata Party), కాంగ్రెస్(Congress) యేతార పార్టీలకు సమన్వయ కర్తగా ఉంటారని భావించిన ప్రస్తుతం అది సాధ్యపడేలా లేదట.. దీంతో కొద్దీ రోజుల పాటు సీఎం గ్యాప్ ఇచ్చి నిర్ణయం తీసుకుంటరనే చర్చ నడుస్తోంది. జాతీయ స్థాయిలో మోడీ మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు రెడీ చేసిన ప్రణాళికలను ప్రస్తుతం గులాబీ బాస్ పక్కన పెట్టారన్న చర్చ టీఆర్‌ఎస్(Telangana Rashtra Samithi) వర్గాల్లో చర్చ జరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories