ఈ నెల 11న అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశంకానున్నారు

X
Telangana Chief Minister KCR in a meeting (file image)
Highlights
ఈనెల 11న ఉదయం సీఎం కేసీఆర్ మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశంకానున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్,...
Sandeep Eggoju8 Jan 2021 6:56 AM GMT
ఈనెల 11న ఉదయం సీఎం కేసీఆర్ మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశంకానున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య ఆరోగ్య, విద్య, అటవీశాఖ, ఇతర శాఖల ముఖ్య అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పెండింగ్ మ్యుటేషన్లు, సాదా బైనామాల క్రమబద్దీకరణ, ట్రిబ్యునళ్ల ఏర్పాటు పార్ట్ బి లో చేర్చిన అంశాల పరిష్కారం, తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. రెవెన్యూకు సంబంధించిన అన్ని అంశాలను సత్వరంగా పరిష్కరించేందుకు అవసరమైన కార్యాచరణపై సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Web TitleTelangana Chief minister KCR meeting with All districts Collectors on 11 January
Next Story