ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ.. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

Telangana Cabinet Meeting Today
x

ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన కీలక నిర్ణయాలు

Highlights

Telangana: ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుల అంశం ప్రస్తావనకు వచ్చే ఛాన్స్

Telangana: ఇవాళ ప్రగతిభవన్‌లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. గవర్నర్ కోటా కింద నామినేట్ అయ్యే ఇద్దరి పేర్లను కేబినెట్ సమావేశం తర్వాత ప్రకటించనున్నారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుల అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇతర పాలనాపరమైన విషయాలు, ప్రస్తుత రాజకీయ అంశాలపై చర్చించనున్నారు. ఇక అలాగే సొంత స్థలాలు ఉన్నవారికి ఇళ్లు నిర్మించుకునేందుకు 3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలపై కూడా మంత్రి వర్గ సమావేశంలో చర్చించే ఛాన్సుంది. ఇళ్ల స్థలాలకు పట్టాల పంపిణీ అంశంపై కూడా స్పష్టమైన కార్యాచరణ రూపొందించే దిశగా సర్కారు కసరత్తు చేస్తోంది. ఈ అంశంపై కూడా మంత్రి వర్గంలో చర్చించే అవకాశముంది. అలాగే పోడు భూముల పట్టాల అంశం కూడా చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories