నేడు తెలంగాణ కేబినెట్ భేటీ కీలక అంశాలపై చర్చించే అవకాశం

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ కీలక అంశాలపై చర్చించే అవకాశం
x
Highlights

-నేడు తెలంగాణ కేబినెట్ భేటీ -కొత్త సచివాలయ నమూనాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్‌ -ప్రస్తుత భవనాల కూల్చివేతపై నిర్ణయం -ఆర్టీసీ సమ్మెపై చర్చ జరిగే అవకాశం -ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంపై చర్చ -పీఆర్సీ అమలుపై చర్చ -కొత్త రెవెన్యూ చట్టంపై నిర్ణయాన్ని ప్రకటించే ఛాన్స్ -నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం -సీఎం కేసీఆర్ అధ్యక్షతన సా.4 గంటలకు కేబినెట్‌ భేటీ -కొత్త సచివాలయ నిర్మాణం, కొత్త చట్ట రూపకల్పనపై చర్చ -దసరా సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ -ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై చర్చించే అవకాశం

నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సాయంత్రం నాలుగు గంటలకు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో కొత్త సెక్రటేరియట్ నమూనాలపై చర్చించి, ఆమోదించనున్నారు. రాష్ట్రంలోని పలు కోర్టుల్లో పోస్టుల భర్తీ, ధాన్యం సేకరణతో పాటు ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేయనుంది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు, పీఆర్సీపై చర్చిస్తారని తెలుస్తోంది. హుజుర్ నగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా సెక్రటేరియట్ ఖాళీ అయిన నేపథ్యంలో కూల్చివేతపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుత సచివాలయ శాఖల తరలింపు ఇప్పటికే పూర్తి అయింది. సమీకృత సచివాలయం కోసం ఆర్కిటెక్టులు 9 నమూనాలను రూపొందించి ప్రభుత్వానికి అందించారు. అందులో కొన్ని మార్పులు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సచివాలయ భవనాల కూల్చివేతతో సహా.. కొత్త భవన నిర్మాణంపై కూడా కేబినెట్ లో చర్చ జరగనుంది. కూల్చివేతకు ఆర్ అండ్ బీ శాఖకు అనుమతి ఇవ్వనున్నారు.

మంత్రివర్గ ఆమోదం పొందాల్సిన సుమారు 10 అంశాలు ఇప్పటికే కేబినెట్ విభాగం దగ్గరికి చేరాయి. వీటిలో ఎక్కువ శాతం ఆర్థికశాఖ నుంచి వచ్చిన ఫైళ్లే. సాయంత్రం వరకు మరికొన్ని అంశాలు క్యాబినెట్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు ముఖ్యమంత్రి అనుమతితో మరికొన్ని కీలక ఫైళ్లు టేబుల్ అజెండాగా క్యాబినెట్ ముందుకు రానున్నాయి.

ఆర్టీసీ కార్మికుల సమ్మె, ఎక్సైజ్ పాలసీ, వైద్య రంగంలో మార్పులు, దసరా సందర్భంగా పలు కార్యక్రమాలు, 30 రోజుల కార్యక్రమంపై చర్చించనున్నారు. వృద్ధాప్య ఫించన్ల అర్హత వయస్సు 57 ఏళ్ళకు తగ్గింపుతో పాటు ఉద్యోగుల వయోపరిమితి 61 ఏళ్ళకు పెంపుపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఆర్టీసీ పరిస్థితిపై ప్రధానంగా చర్చించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories