18న తెలంగాణ కేబినెట్ భేటీ... 19న టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం

18న తెలంగాణ కేబినెట్ భేటీ... 19న టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం
x
Highlights

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉండడంతో కొన్ని రోజులు ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డం ఏర్పడ్డాయి .. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ తోలిగిపోవడంతో పాలన పైన...

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉండడంతో కొన్ని రోజులు ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డం ఏర్పడ్డాయి .. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ తోలిగిపోవడంతో పాలన పైన ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్ .. అయితే అందులో భాగంగానే తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగబోతోంది. జూన్ 18న ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్‌లో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కొత్త మున్సిపల్, రెవెన్యూ చట్టాలపై సుదీర్ఘంగా చర్చించి కేబినెట్‌ నిర్ణయం తీసుకోనుంది. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లులను ప్రవేశ పెట్టనున్నారు. ఇతర అంశాలపై కూడా కేబినెట్ చర్చించనుంది. ఇదిలా ఉంటే జూన్ 19వ తేదీన టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం జరుగనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories