మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

Telangana Cabinet Meeting at 2 pm
x

మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

Highlights

TS Cabinet: కేబినెట్‌లో 12 అంశాలపై చర్చ

TS Cabinet: ఇవాళ తెలంగాణ కేబినెట్, టీఆర్ఎస్‌ ఎల్పీ సమావేశం జరగనుంది. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మంత్రిమండలి సమావేశం జరుగుతుంది. ఎజెండాలో మొత్తం 12అంశాలు ఉన్నట్లు తెలిసింది. ఆగస్టు 15 నుంచి 57 ఏళ్లు నిండిన వారికి కూడా ఫించన్లు ఇస్తున్నారు. ఐతే వీటి సంఖ్యను మరింతగా పెంచే అవకాశముంది. ఈ నెల 25 నుంచి బతుకమ్మ పండగ జరనున్న నేపథ్యంలో.. ఎప్పటిలాగే ఈసారి కూడా 1.33 కోట్ల చీరలను ఉచితంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ చీరల పంపిణీ తేదీలపై సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపాలని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.కానీ అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలో కేంద్రంతో సంబంబం లేకుండా.. పోడు రైతులకు న్యాయం చేసేలా విచక్షణాధికారులను ఉపయోగించి ఏవైనా నిర్ణయాలు తీసుకోవచ్చా? అని మంత్రివర్గంలో చర్చించనున్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు ఎన్ని నిధులు వచ్చాయన్న దానిపై సమావేశాల్లో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనుంది.

ఓ వైపు మునుగోడు ఉపఎన్నికకు బీజేపీ, కాంగ్రెస్ సిద్దం కావడం.. ఈ స్థానాన్ని ఎలాగైనా టీఆర్ఎస్ గెలుచుకోవాలన్న లక్ష్యంతో ముందుకు పోతున్న తరుణంలో సీఎం కేసీఆర్ అనుసరించబోయే వ్యూహంపైనే అటు అధికార పార్టీలోనూ..విపక్ష పార్టీలోనూ జోరుగా చర్చ సాగుతుంది. సెప్టెంబర్ 17పై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నైజాం విముక్త తెలంగాణకు 75ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఏడాది పాటు వజ్రోత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ రైతాంగ పోరాటాన్ని హైలెట్ చేస్తూ కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రగతిభవన్‌లో జరిగే మంత్రివర్గ సమావేశంలో సెప్టెంబర్ 17తో పాటు ఈనెల 6నుంచి ప్రారంభం కానున్న శాసనసభ, మండలి సమావేశాలపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. శాసనసభ సమావేశాల నిర్వహణ, ఎజెండాపై కేబినెట్‌లో చర్చించి సమావేశాల తేదీలను ఖరారు చేస్తారు.ఇక కేబినెట్ భేటీ తర్వాత జరిగే TRSLP సమావేశాన్ని ఏర్పాటు చేయడంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ భేటీలో మునుగోడు ఉప ఎన్నికలపై పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం చేయనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories