Telangana: త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ?

Kcr Decided To Cabinet expansion
x

కెసిఆర్ ఫైల్ ఫోటో 

Highlights

Telangana: నలుగురు మంత్రులపై కేసీఆర్ అసంతృప్తి

Telangana:తెలంగాణలో సాగర్ ఎన్నికల తర్వాత అధికార పార్టీలో పదవుల పందేరం ఉండనున్నట్టు జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే కారు పార్టీ అధినేత ఇచ్చిన టాస్క్ పూర్తి చేసిన వారికి, పార్టీకి లాయల్‌గా ఉన్న వారికి పదవులు కట్టబెడుతారని గులాబీ వర్గాలంటున్నాయి. సాగర్ ఎన్నికలు పూర్తవ్వగానే అవసరం అయితే.. క్యాబినెట్ పదవుల రీఫిల్‌తో పాటు నామినేటెడ్ పదవులు కట్టబెడుతారని తెలుస్తోంది..

సీఎం కేసీఆర్ కేబినెట్‌లో మార్పులు, చేర్పులు అనే చర్చ ఊరిస్తోంది. అయితే.. ఈసారి ఖచ్చితంగా పదవులు పదేరం ఉంటుందనే చర్చ ఊపందుకుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చాక.. దాదాపు ఏడాదిన్నర కాలం తర్వాత సీఎం కేసీఆర్ మంత్రి వర్గ పునర్వవస్థీకరస్తారని తెలుస్తోంది. అది కూడా నాగార్జునసాగర్, లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోగానే.. వాటి ఫలితాల ఆధారంగా కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారని గులాబీ వర్గాలు అంటున్నాయి.

ఎన్నికల్లో బాగా పనిచేసే మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కేబినెట్‌లో చాన్స్ ఇస్తారని భావిస్తున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక 2019 సెప్టెంబర్‌లో జరిపిన విస్తరణలో కేసీఆర్.. ఆరుగురు మంత్రులను అదనంగా కేబినెట్ చేర్చుకున్నారు. అయితే.. ఇప్పుడు జరిగే క్యాబినెట్ విస్తరణలో ఎవరికి చోటు ఉంటుంది.. ఎవరిని తొలగిస్తారనే చర్చ టీఆర్ఎస్ వర్గాల్లో గుబులు పుట్టిస్తోంది.

ఈ సారి నిజామాబాద్ ఎమ్మెల్సీగా గెలిచిన కల్వకుంట్ల కవిత పేరు తెరపైకి వచ్చింది. అయితే.. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు క్యాబినెట్‌ ఉండడంతో ఆమెను తీసుకుంటే ఎలా ఉంటుదన్న విషయంపై కేసీఆర్ ఆరా తీస్తున్నారు. ఆమెతోపాటు గుత్తా సుఖేందర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, రేఖానాయక్, దాస్యం వినయ్ భాస్కర్‌, బాల్కసుమన్, గువ్వల బాలరాజుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

ఇటీవల ఎమ్మెల్సీగా గెలిచిన పీవీ కూతురు సురభీ వాణీదేవి విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. గుత్తాకు కేబినెట్ చాన్స్ ఇచ్చి.. వాణీదేవికి మండలి ఛైర్మన్‌గా లేదంటే వైస్ చైర్మన్‌గా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. రైతుబంధు సమితి ఛైర్మన్ పల్లారాజేశ్వర రెడ్డి కూడా కేబినెట్ బెర్త్ ఆశిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు.. సీఎం కేసీఆర్ ప్రధానంగా ముగ్గురు, నలుగురు మంత్రులపై అసంతృప్తిలో ఉన్నారని... వారిని తప్పించి కొత్తవారికి ఛాన్స్ ఇవ్వనున్నారు..

మొత్తానికి పదవుల పందేరం అనే సరికి నాయకుల్లో కొత్త ఉత్సహం వస్తోంది. దీంతో ఇటు నామినేటెడ్ పదవులతో పాటు, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా అవకాశం కోసం ఎదురుచూస్తోన్న నేతలు కారుపార్టీ అధినేత కేసీఆర్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories