Harish Rao: 111 జీవో ప్రాంతంలో రహదారులు విస్తరిస్తాం

Telangana Cabinet Announces Scrapping Of Go No 111
x

Harish Rao: 111 జీవో ప్రాంతంలో రహదారులు విస్తరిస్తాం

Highlights

Harish Rao: 84 గ్రామాలకు మేలు చేసేందుకే జీవో ఎత్తివేశాం

Harish Rao: కేబినెట్ భేటీలోని నిర్ణయాలను మంత్రి హరీశ్ రావు వివరించారు. 111 జీవో పరిధిలోని 84 గ్రామాలకు మేలు చేసేందుకే ఆ జీవోను ఎత్తివేశామని, 111 జీవో ప్రాంతంలోని రహదారులను విస్తరిస్తామని వెల్లడించారు. 2018 ఎన్నికల్లో 111 జీవోను ఎత్తివేస్తామని సీఎం హామీ ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు. 111 జీవో పరిధిలోని 84 గ్రామాలకు ఇక నుంచి ఆంక్షలు ఉండవని, ఈ గ్రామాల చుట్టూ రింగ్ మైన్ను నిర్మాణం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని, కాళేశ్వరం జలాలను మూసి, గండిపేటకు లింక్ చేయాలని నిర్ణయించామన్నారు. హుస్సేన్సాగర్ను రానున్న రోజుల్లో అనుసంధానించాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి హరీష్ రావు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories