TS Assembly: ఫిబ్రవరి 3 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

Telangana Budget Sessions Start From February 3
x

TS Assembly: ఫిబ్రవరి 3 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

Highlights

TS Assembly: 3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం

TS Assembly: తెలంగాణ శాసనసభ, మండలి బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3వ తేదీన మధ్యాహ్నం 12 గంటల పది నిమిషాలకు ప్రారంభం కానున్నాయి. అదే రోజు బడ్జెట్ ని ప్రవేశ పెట్టనున్నారు. దాదాపు రెండు వారాల పాటు సమావేశాలు నిర్వహించే ఆలోచన లో ప్రభుత్వం. ఇప్పటికే ఆర్థిక శాఖ వారం రోజుల నుంచి బడ్జెట్ కసరత్తు ని ప్రారంభించింది ఎన్నికల బడ్జెట్ కావడం తో భారీ అంచనాలు పెట్టుకుంది ప్రభుత్వం గత బడ్జెట్ తో పోలిస్తే ఈ బడ్జెట్ లో కేటాయింపులు ఎక్కువ గానే ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్ధిక శాఖ కసరత్తు ప్రారంభించింది.శాఖల వారిగా బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్​లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌ రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్‌కుమార్‌ , ఇతర అధికారులు పాల్గొన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం 3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఈమేరకు అన్ని శాఖల నుంచి కేటాయింపుల కోసం ముసాయిదా ప్రతిపాదనలు ఆర్థికశాఖకు చేరాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories