రాజాసింగ్‌ డ్రైవర్లు, గన్‌మెన్లకు కరోనా పాజిటివ్..

రాజాసింగ్‌ డ్రైవర్లు, గన్‌మెన్లకు కరోనా పాజిటివ్..
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్మేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు వారి డ్రైవర్లు, గన్ మెన్లను కూడా కరోనా వైరస్ కబలిస్తుంది.

తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్మేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు వారి డ్రైవర్లు, గన్ మెన్లను కూడా కరోనా వైరస్ కబలిస్తుంది. కొన్ని రోజుల క్రితం, జీహెచ్ఎంసీ మేయర్ దగ్గర విధులు నిర్వహించే వారికి, అలాగే మంత్రి హరీశ్ రావు పీఎ కి కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం మరో ఎమ్మెల్యే డ్రైవర్లకు, గన్ మెన్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. పూర్తివివరాల్లోకెళితే తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ డ్రైవర్లు, గన్‌మెన్లకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది. ఆయన వద్ద విధులు నిర్వహిస్తున్న ఇద్దరు డ్రైవర్లు, ముగ్గురు గన్‌మెన్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కాగా ఆయన దగ్గర పని చేస్తున్న మరో ఐదుగురికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది.

ఇక పోతే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పలువురు ప్రజాప్రతినిధులు కరోనా వైరస్‌ బారినపడ్డారు. వారిలో జనగామ శాసస సభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సైతం కరోనా పాజిటివ్‌గా తేలింది. మరోవైపు నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధర్‌, బీగాల గణేష్‌ గుప్తాకు సైతం వైరస్‌ సోకింది.

ఇక పోతే తెలంగాణలో బుధవారం కొత్తగా 891 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 719 కేసులు వచ్చాయి. అలాగే రంగారెడ్డి 86, మేడ్చల్ 55 , సంగారెడ్డి 2, వరంగల్ రురల్ 3 ,కామారెడ్డి 1 , కరీంనగర్ 2, ఖమ్మం 4 , సిద్దిపేట 1, భద్రాద్రి 6, సిరిసిల్ల 1, వరంగల్ అర్బన్ 3, గద్వాల్ 1, పెద్దపల్లి 1, సూర్యాపేట 1, నల్గొండ 2, నిజామాబాద్ 1, మహబూబాబాద్ 1, ఆదిలాబాద్ 1 నమోదయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 10వేల 444కు చేరింది.

మరో ఐదుగురు కరోనా భారిన పడి మరణించడంతో.. ఇప్పటివరకు మరణాల సంఖ్య 225 కు చేరింది. ఇక గత 24 గంటల్లో 157 మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ మొత్తం 4 వేల 361 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 5 వేల 858 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు గత 24 గంటల్లో కొత్తగా 4 వేల 69 టెస్టులు చేశారు. దీంతో తెలంగాణలో టెస్టుల సంఖ్య 67 వేల 318కి చేరింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories