తెలంగాణ హైకోర్టు బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు సన్మానం

Telangana Bar Council Honors CJI NV Ramana | TS News Today
x

తెలంగాణ హైకోర్టు బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు సన్మానం

Highlights

CJI NV Ramana: హైకోర్టుకి వస్తే తల్లి ఒడిలో ఉన్నట్లు ఉంది

CJI NV Ramana: ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే.. తాను ఎక్క ఉన్నా.. ఎంతటి పోస్టులో ఉన్నా తెలంగాణ బార్ అసోసియేషన్ సభ్యుడినే అన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. తెలంగాణ హైకోర్టు బార్ కౌన్సిల్ సమావేశానికి సీజేఐ ఎన్వీ రమణ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. తెలంగాణ హైకోర్టుకు వస్తే తల్లి ఒడిలో ఉన్నట్టు ఉందన్నారు. తెలంగాణ హైకోర్టు తనకు చాలా నేర్పిందనన్నారు.

సామాన్యుడికి న్యాయం చేకూరడానికి రెండు విషయాలు చాలా కీలకం అన్నారు. కోర్టులు అందుబాటులో ఉండటం, వాటిలో మౌళిక సదుపాయాలు ఉండాలన్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు చీఫ్ జిస్టిస్ ఎన్వీ రమణను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టీస్ సతీష్ చంద్రశర్మ, హైకోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ సభ్యులు, పలువురు న్యాయవాదజులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories