తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా

Telangana Assembly Meetings Postponed Indefinitely
x

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా

Highlights

ఆరు రోజుల పాటు కొనసాగిన శాసనసభ సమావేశాలు

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. డిసెంబర్ 9న ప్రారంభమైన శాసన సభా సమావేశాలు మొత్తం ఆరు రోజుల పాటు కొనసాగాయి. ఈ ఆరు రోజుల్లో 26 గంటల 33 నిమిషాల పాటు సమావేశాలు కొనసాగినట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా..మొత్తం 19 మంది ఎమ్మెల్యేలు ప్రసంగించారు. రెండు అంశాలపై స్వల్పకాలిక చర్చలు జరిగాయి. నిరవధిక వాయిదా వేసే సమయానికి.. సభలో కాంగ్రెస్ 64, బీఆర్ ఎస్ 39, బీజేపీ 8, ఎంఐఎం 7, ఒక సీపీఐ ఎమ్మెల్యే ఉన్నట్లు స్పీకర్ ప్రకటించారు.

డిసెంబర్ 9 న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో గత ప్రభుత్వం పనితీరు, ఖర్చులపై కాంగ్రెస్ సర్కార్ శ్వేత పత్రం విడుదల చేసింది. గత ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ , ప్రాజెక్టుల్లో అక్రమాలు జరిగాయని..విచారణ చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories