TS Assembly: కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఏడు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

Telangana Assembly Meetings
x

TS Assembly: కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఏడు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

Highlights

TS Assembly: ఉభయసభల ముందుకు బీఏసీ సమావేశం నిర్ణయాలు

TS Assembly: మరో గంటలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రెండోరోజు సమావేశాల్లో భాగంగా నిన్నటి బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ప్రశ్నోత్తరాలు కొనసాగనున్నాయి. ప్రశ్నోత్తరాల కోసం 10 అంశాలను కేటాయించారు. ఐటీ ఎగుమతులు, రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, చార్మినార్‌లో పాదచారుల రోడ్డు, ఆరోగ్య లక్ష్మి, హైదరాబాద్ పరిధిలో రోడ్ల పనులు, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం, బీసీ కులవృత్తుల కుటుంబాలకు ఆర్థిక సాయం లాంటి ప్రశ్నలు చర్చకు రానున్నాయి. ఇక రాష్ట్రంలో అధిక వర్షపాతం వల్ల కలిగిన ఇబ్బందులు.. ప్రభుత్వం చేపట్టిన చర్యలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. విద్య వైద్య రంగాల బలోపేతం కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలపై కూడా చర్చ జరగనుంది.

ఇక ఇవాళ ఏడు బిల్లులు అసెంబ్లీ ముందుకు రానున్నాయి. ది తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ బిల్‌ను మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టనుండగా.. ది ఫ్యాక్టరీస్ అమెండ్‌మెంట్‌ బిల్లును మంత్రి మల్లారెడ్డి, తెలంగాణ మైనార్టీ కమిషన్ చట్ట సవరణ బిల్లును మంత్రి కొప్పుల ప్రవేశపెడతారు. గతంలో గవర్నర్ తిప్పిపంపిన మూడు బిల్లులను మరోసారి ప్రవేశపెట్టి గవర్నర్ ఆమోదానికి పంపమన్నారు. ఇటీవల తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబందించిన బిల్లును కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories