Telangana Assembly: రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశం

Telangana Assembly Meeting Tomorrow
x

Telangana Assembly: రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశం

Highlights

Telangana Assembly: స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ను ఎంపిక చేసిన కాంగ్రెస్

Telangana Assembly: అసెంబ్లీ సమావేశాల్లో తొలి సమావేశాలకు ప్రొటెం స్పీకర్‌గా ఎవరు వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కొత్తగా ఎన్నికైన సభ్యులతో మొదటగా ప్రమాణ స్వీకారం చేయించి.. అనంతరం, స్పీకర్‌ను ఎన్నుకునేంత వరకు ప్రొటెం స్పీకర్‌ గా ఓ శానసనసభ్యుడు బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. సాధారణంగా ఎక్కువసార్లు శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తుంటారు. రేపు అసెంబ్లీ సమావేశం జరగనుండటంతో ఈ సమావేశాలకు ఎవరు ప్రొటెం స్పీకర్‌ గా వ్యవహరించనున్నారనే దానిపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం అత్యధికంగా ఎనిమిది సార్లు ఎన్నికైన ఎమ్మెల్యేగా మాజీ సీఎం కేసీఆర్‌ ఉన్నారు. బీఆర్ఎస్ కు చెందిన ఇతర సభ్యుల్లో మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, దానం నాగేందర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆరుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. కాంగ్రెస్‌లో ఆరుసార్లు ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు. వీరిద్దరూ మంత్రులుగా నియమితులయ్యారు.

ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ఆరుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. రేపు జరగనున్న అసెంబ్లీ సమావేశంలో మొదట ప్రొటెం స్పీకర్.. అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం, స్పీకర్ ఎన్నిక జరగుుతుంది. ఈ పరిస్థితుల్లో ఎవరు ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 4 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి రోజు ఎన్నికైన శాసనసభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రెండో రోజు స్పీకర్‌ని ఎన్నుకున్న తర్వాత సభ్యులు అభినందనలు తెలపనున్నారు. 3వ రోజు కాంగ్రెస్‌ పార్టీ అమలు చేయనున్న ఆరు గ్యారెంటీలపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories