TGEAPCET: నేటి నుంచి తెలంగాణ ఎప్‎సెట్ కౌన్సెలింగ్

TGEAPCET: నేటి నుంచి తెలంగాణ ఎప్‎సెట్ కౌన్సెలింగ్
x

TGEAPCET: నేటి నుంచి తెలంగాణ ఎప్‎సెట్ కౌన్సెలింగ్

Highlights

TGEAPCET:తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ లో ప్రవేశాలకు టీజీ ఎప్ సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ షురూ అయ్యింది. నేటి నుంచి ఈనెల 12వ తేదీ వరకు తొలివిడత రిజిస్ట్రేషన్ కొనసాగుతుంది.

TGEAPCET:తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ లో ప్రవేశానికి టీజీ ఎప్ సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ నేటి నుంచి షురూ అయ్యింది. నేటి నుంచి ఈనెల 12వ తేదీ వరకు తొలివిడత రిజిస్ట్రేషన్ కొనసాగుతుంది. దీనిలో భాగంగా విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, సర్టిఫికెట్ వెరిఫికేషన్లకు స్లాట్ బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈనెల 6 నుంచి 13వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 36 హెల్ప్ లైన్ సెంటర్లలో ఏదొక చోట ధ్రువపత్రాల పరిశీలనకు హాజరవ్వాల్సి ఉంటుంది. పరిశీలన చేయించుకున్న వారు ఈనెల 8 నుంచి 15వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. వారికి ఈనెల 19న లేదా ఆ లోపు తొలి విడత సీట్లు కేటాయిస్తారు. ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ కు జులై 19 నుంచి 23వ తేదీ వరకు అవకాశం కల్పించారు.

గతేడాది వరకు ఫలితాలు రిలీజ్ చేసేందుకు ఒక వెబ్ సైట్, అడ్మిషన్లకు కౌన్సెలింగ్ కు మరో వెబ్ సైట్ ఉండేది. దీంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యేవారు. ఈసారి ఎప్ సెట్ వెబ్ సైట్ www.eapcet.tsche.ac.inలోకి వెళ్లి అక్కడ అడ్మిషన్ పై క్లిక్ చేస్తే కౌన్సెలింగ్ వెబ్ సైట్లోకి వెళ్తారు.

ఇంజనీరింగ్ కోర్సులు:

బీఈ/ బీటెక్‌, బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్), బీటెక్ (బయో-టెక్నాలజీ), బీటెక్ (డెయిరీ టెక్నాలజీ), బీటెక్‌(ఫుడ్ టెక్నాలజీ), బీఫార్మసీ (ఎంపీసీ), ఫార్మ్-డి (ఎంపీసీ).

అగ్రికల్చర్ అండ్‌ ఫార్మసీ కోర్సులు:

బీఎస్సీ(నర్సింగ్), బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్, బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్, బీఎస్సీ(ఫారెస్ట్రీ), బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌, బీఎఫ్‌ఎస్సీ, బీటెక్‌(ఫుడ్ టెక్నాలజీ), బీఫార్మసీ (బైపీసీ), ఫార్మ్-డి (బైపీసీ).

తొలిదశ కౌన్సెలింగ్ షెడ్యూల్‌:

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, స్లాట్‌: జూలై 04 నుంచి 12 వరకు ఉంది.

ధ్రువపత్రాల పరిశీలన: జూలై 06 నుంచి 13 వరకు ఉంది.

ఆప్షన్ల ఎంపిక: జూలై 08 నుంచి 15 వరకు ఉంటుంది.

ఆప్షన్ల ఫ్రీజింగ్‌: జూలై 15

సీట్ల కేటాయింపు: జూలై 19

సెల్ఫ్‌ రిపోర్టింగ్‌: జూలై 19 నుంచి 23 వరకు

Show Full Article
Print Article
Next Story
More Stories