Annual Crime: తెలంగాణ‌లో నేరాలు పెరిగాయి.. వార్షిక నివేదిక విడుద‌ల చేసిన డిజిపి

Telangana Annual Crime Report 2023 DGP Ravi Gupta Said Crimes Increased In 2023
x

Annual Crime: తెలంగాణ‌లో నేరాలు పెరిగాయి.. వార్షిక నివేదిక విడుద‌ల చేసిన డిజిపి

Highlights

Annual Crime: CEIR ద్వారా 33.80 శాతం మొబైల్స్ రికవరీ

Annual Crime: తెలంగాణ వార్షిక క్రైమ్ నివేదికను డీజీపీ రవిగుప్తా విడుదల చేశారు. గతేడాదితో పోలిస్తే 8.97శాతం నేరాలు పెరిగాయని డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. రహదారి ప్రమాదాలు ఒక శాతం తగ్గాయని తెలిపారు. ఈ ఏడాది మొత్తంగా 2లక్షల 13 వేల 121 కేసులు నమోదు చేయగా.. నేరాలకు పాల్పడుతున్న 175 మందిపై పీడీయాక్ట్ విధించామన్నారు. మొత్తం 73 అత్యాచార కేసుల్లో 84 మంది దోషులకు జీవిత ఖైదీ శిక్షలు పడినట్టు వివరించారు.

సైబర్ క్రైమ్ కేసులు గతేడాదితో పోలిస్తే 17.59 శాతం పెరిగాయన్నారు. మొత్తంగా వెయ్యి 108 జీరో ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశామని.. ఐపీసీ సెక్షన్ కింద లక్షా 38 వేల 312 కేసులు నమోదయినట్లు తెలిపారు. మొబైల్స్ రికవరీలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్ ఉందని ఆయన వెల్లడించారు.

సమాజానికి డ్రగ్స్, సైబర్ క్రైమ్ సవాల్ గా మారిందన్నారు. డ్రగ్స్ విషయంలో ఎవరినీ ఉపేక్షించమని ఆయన స్పష్టం చేశారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో ద్వారా 59 కేసులు నమోదు చేసి, 182 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపిన డీజీపీ.. 7.99 కోట్లు సీజ్ చేసినట్టు వివరించారు. 175 మంది రిపీటెడ్ డ్రగ్ ఫెడ్లర్స్‌పై పీడీ యాక్ట్ నమోదు చేశామని, 12 మంది ఫారెన్ అఫెండర్స్‌ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు.

తెలంగాణలో ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ కేసులు ఒక వెయ్యి 877 నమోదు చేశామన్నారు. మహిళలపై వేధింపుల విషయంలో.. 19 వేల 13 కేసులు నమోదైనట్టు డీజీపీ వివరించారు. ఇందులో 2 వేల 284 అత్యాచారం కేసులుండగా.. 33 వరకట్న హత్యలు, 132 వరకట్న మరణాలు, 9 వేల 458 వరకట్న వేధింపుల కేసులు, 884 మహిళ కిడ్నాప్ కేసులు నమోదైనట్టు తెలిపారు . ఈ ఏడాది 2 వేల 426 పొక్సో కేసులు నమోదు కాగా.. ఒక నిందితుడికి మరణ శిక్ష, 104 మందికి జీవిత ఖైదీ శిక్షలు విధించినట్టు పేర్కొన్నారు.

ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు 20 వేల 699 కేసులు నమోదు కాగా.. 6 వేల 788 మంది మృతి చెందారు. 19 వేల 137 మంది గాయాల పాలయ్యారు. 287 హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు నమైదు కాగా.. 557 మంది భాదితులను రెస్క్యూ చేశారు. 364 మంది ట్రాఫికర్స్‌ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. గ్రే హౌండ్స్ అండ్ ఆక్టోపస్ ద్వారా 132 జరగ్గా.. అందులో124 తెలంగాణలో, మరో 8 అంతర్రాష్ట్రాల్లో ఆపరేషన్‌లు నిర్వయించినట్టు డీజీపీ రవి గుప్తా తెలిపారు.

మావోయిస్టు, నేరరహిత రాష్ట్రమే లక్ష్యంగా రాష్ట్ర పోలీసులు ఈ ఏడాది కృషి చేశారు. నేర నియంత్రణ కోసం పోలీసులు చేపడుతున్న పలు చర్యల వల్ల నేరాల శాతం గతేడాదితో పోలిస్తే 6 శాతం తగ్గింది. తరచూ కూంబింగ్ ల ద్వారా 11 సార్లు ఎదురు కాల్పులు జరిగాయి...11మంది మావోయిస్టులు మరణించారు. 132 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. 45 మంది లొంగిపోగా.. రాష్ట్రంలో మావోయిస్టులు 3 జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యారని డీజీపీ రవి గుప్తా వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories