Anganwadi Jobs 2020 : అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Anganwadi Jobs 2020 : అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
x

ప్రతీకాత్మక చిత్రం

Highlights

Anganwadi Jobs 2020 : తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్ వాడీ పోస్టులను మహిళా, శిశు సంక్షేమ శాఖ భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే...

Anganwadi Jobs 2020 : తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్ వాడీ పోస్టులను మహిళా, శిశు సంక్షేమ శాఖ భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లాలో ఖాళీగా ఉన్న 232 అంగన్వాడీ పోస్టుల్ని మహిళా, శిశు సంక్షేమ శాఖ భర్తీ చేయనుంది. జిల్లాలోని 7 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఆమన్‌గల్, చేవెళ్ల, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, శేరిలింగంపల్లి, షాద్‌నగర్ పరిధిలో అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయాలు, మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాగా ఈ ఖాళీలున్నాయి ప్రస్తుతం భర్తీ చేస్తున్నట్టు ప్రకటన విడుదల చేసారు. విద్యార్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అంతే ఏయే అంగన్వాడీ సెంటర్‌లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకునేందుకు కూడా http://wdcw.tg.nic.in/ వెబ్ సైట్ ను విడుదల చేసారు. ఈ వెబ్ సైట్ లో నోటిఫికేషన్‌కు సంబంధించిన ఇతర వివరాలు కూడా చూసుకొవచ్చు. అయితే ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు స్థానికంగా నివసించేవారు అయి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

ఖాళీల వివరాలు...

మొత్తం ఖాళీలు- 232

అంగన్వాడీ టీచర్- 41

అంగన్వాడీ ఆయా- 174

మినీ అంగన్వాడీ టీచర్- 17

ముఖ్యమైన తేదీలు..

2020 సెప్టెంబర్ 5న దరఖాస్తు ప్రారంభం

2020 సెప్టెంబర్ 18 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుకు చివరి రోజు

పదవతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి

2020 జూలై 1 నాటికి 21 నుంచి 35 ఏళ్లు ఉండాలి.

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీస వయస్సు 18 ఏళ్లు

మహిళలు వివాహితులై స్థానిక గ్రామపంచాయతీలోనే నివసిస్తూ ఉండాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories