TS 10th Result 2025: పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..92.78శాతం ఉత్తీర్ణత

TS 10th Result 2025: పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..92.78శాతం ఉత్తీర్ణత
x

TS 10th Result 2025: పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..92.78శాతం ఉత్తీర్ణత

Highlights

TS 10th Result 2025: తెలంగాణలో పదవ తరగతి పరీక్ష ఫలితాలు బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. రవీంద్రభారతిలో జరిగిన ప్రత్యేక...

TS 10th Result 2025: తెలంగాణలో పదవ తరగతి పరీక్ష ఫలితాలు బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. రవీంద్రభారతిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఫలితాలను ఆయన విడుదల చేశారు. పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 92.78శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గురుకులాల్లో 96శాతం ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే 1.47శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. దాదాపు 5లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కావడం..మార్కుల మెమోలను ఎలా ఇవ్వాలన్న అంశంపై ఇప్పటికే అధికారులకు పూర్తిస్థాయి స్పష్టత వచ్చింది. https://bse.telangana.gov.in/, లేదా https://results.bse.telangana.gov.in/ ఈ డైరెక్ట్ లింక్స్ ద్వారా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories