తెలంగాణ: పదో తరగతి పరీక్షల షెడ్యూల్ రిలీజ్

తెలంగాణలో టెన్త్ కాస్ల్ షెడ్యూల్ రిలీజ్ అయింది.

Samba Siva Rao
Updated on: 9 Feb 2021 6:28 PM IST
తెలంగాణ: పదో తరగతి పరీక్షల షెడ్యూల్ రిలీజ్
X

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ రిలీజ్

తెలంగాణలో టెన్త్ కాస్ల్ షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ మేరకు మంగళవారం నోటిఫికేషన్ టీఎస్‌ ఎస్‌ఎస్‌సీ బోర్డు విడుదల చేసింది. కరోనా కారణంగా ఈ ఏడాది విద్యాసంవత్సరం పూర్తి స్తాయిలో సాధ్య పడలేదు. దీంతో ఈ విద్యా సంవత్సరంలో ఆరు పేపర్లకు కుదింస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. మే 17 లాంగ్వేజ్ పరీక్ష నుంచి 26 సోషల్ స్టడీస్ తో పరీక్షలు ముగియనున్నాయి. పరీక్షా సమయం ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు ఉంటుందని తెలిపింది. పరీక్షలకు హాజరైయ్యే విద్యార్థులు 30 నిమిషాల ముందుగానే పరీక్షాకేంద్రానికి హాజరుకావాలని విద్యాశాఖ ప్రకటించింది.

పరీక్షల తేదీలు

మే 17న తెలుగు, మే 18న హిందీ, మే 19న ఇంగ్లీష్‌, మే 20న మ్యాథ్స్‌, మే 21న సైన్స్‌, మే 22న సోషల్‌ పరీక్షలు జరుగుతాయని ఎస్‌ఎస్‌సీ బోర్డు పేర్కొంది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story