Telangana 10 Hours Work Rule: ఉద్యోగుల టైమింగ్స్‌పై ప్రభుత్వం సంచలన నిర్ణయం

Telangana 10 Hours Work Rule: ఉద్యోగుల టైమింగ్స్‌పై ప్రభుత్వం సంచలన నిర్ణయం
x

Telangana 10 Hours Work Rule: ఉద్యోగుల టైమింగ్స్‌పై ప్రభుత్వం సంచలన నిర్ణయం

Highlights

Telangana 10 Hours Work – తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల పని వేళల్లో కీలక మార్పులు చేసింది. ఇకపై రోజుకు 10 గంటల పని విధానం అమల్లోకి వస్తుంది. పూర్తి సమాచారం ఇక్కడ...

తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ఉద్యోగ రంగాన్ని పూర్తిగా కదిలించివేసింది. ఇప్పటివరకు రోజుకు 8 గంటలపాటు ఉన్న పని సమయాన్ని ఇకపై 10 గంటలుగా పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సవరణ వ్యాపార సంస్థలు మరియు ఉద్యోగుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్నది.

పని వేళల పెంపు – కానీ పరిమితి ఉంది!

ప్రభుత్వం ఒకవేళ పనిచేసే గంటలు 48 గంటలు మించి పోతే, ఆ సంస్థలు తప్పనిసరిగా ఓవర్‌టైం (OT) భత్యాన్ని చెల్లించాల్సిందే అనే నిబంధనను కూడా స్పష్టంగా పేర్కొంది. వారానికి 6 రోజుల పని ప్రాతిపదికన, రోజుకు గరిష్ఠంగా 8 గంటలు కాకుండా 10 గంటల పని సమయం ఉండవచ్చని తెలిపింది.

విశ్రాంతి సమయంలో కూడా స్పష్టత

ఒకే సారిగా 10 గంటల పని చేయకుండా, ప్రతి 6 గంటల పని తర్వాత కనీసం అరగంట విరామం కల్పించాల్సిందే. ఈ బ్రేక్ సమయం కలుపుకుని మొత్తం పని సమయం 12 గంటలు మించకూడదని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం కీలక చర్య

ఈ నిర్ణయం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సూత్రాల ప్రకారమే తీసుకున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో కఠిన నిబంధనల వల్ల వ్యాపార సంస్థలు ఉద్యోగుల పని వేళలను సర్దుబాటు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు ప్రభుత్వం అభిప్రాయపడింది.

ఇరు వర్గాలకూ లాభమే: ఉద్యోగులు - నిబంధనలు, సంస్థలు - సౌలభ్యం

ఈ మార్పుల వల్ల సంస్థలు తమ అవసరాలను బట్టి ఉద్యోగుల టైమింగ్స్‌ను సులభంగా సర్దుబాటు చేయవచ్చు. అదే సమయంలో ఉద్యోగులకు అవసరమైన విరామం, ఒవర్టైమ్ హక్కులు ఉండడంతో ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కూడా జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో కూడా మార్పులు

తెలంగాణలో ఈ మార్పులు చోటుచేసుకోగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఇటీవల ఉద్యోగుల పనివేళలపై నిర్ణయాలు తీసుకుంది. మహిళలు రాత్రి 7 తర్వాత, ఉదయం 6 గంటల ముందు కూడా పని చేయవచ్చని అనుమతి ఇచ్చింది. అలాగే, రోజువారీ పని వేళలను 9 గంటల నుంచి 10 గంటలకు పెంచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories