Adilabad: బాలికను బెదిరించి నగ్నంగా వీడియో తీసి షేర్ చేసిన బాలుడు..

Adilabad: బాలికను బెదిరించి నగ్నంగా వీడియో తీసి షేర్ చేసిన బాలుడు..
x

Adilabad: బాలికను బెదిరించి నగ్నంగా వీడియో తీసి షేర్ చేసిన బాలుడు..

Highlights

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో చోటుచేసుకున్న ఓ దారుణ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

ఆదిలాబాద్‌లో బాలికను బెదిరించి నగ్న వీడియో కాల్ కోరిన బాలుడు – వీడియో షేర్ చేసి కలకలం

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో చోటుచేసుకున్న ఓ దారుణ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. స్నేహం పేరుతో ఓ 16 ఏళ్ల బాలుడు, అదే వయసున్న బాలికతో సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం పెంచుకొని, ఆమెను బెదిరించి నగ్నంగా వీడియో కాల్ చేయాలంటూ ఒత్తిడి చేశాడు. చేయకపోతే ఆమె చాటింగ్ స్క్రీన్‌షాట్లు తల్లిదండ్రులకు పంపిస్తానని హెచ్చరించాడు. భయంతో బాలిక వీడియో కాల్‌ చేసిన సమయంలో బాలుడు దాన్ని రికార్డు చేసి తన స్నేహితులతో పంచుకున్నాడు.

ఈ దారుణ ఘటనపై గుడిహత్నూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసును డిప్యూటీ ఎస్పీ కాజల్ సింగ్ పర్యవేక్షిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో మొత్తం ఎనిమిది మంది బాలికను మానసికంగా, శారీరకంగా వేధించినట్లు తేలింది. వారి మీద పోక్సో చట్టంతో పాటు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అనంతరం షీ టీం మరియు ఇచ్చోడ పోలీసులు కలిసి సీఐ రాజు నేతృత్వంలో నిందితులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఇద్దరు మైనర్లు కాగా, మిగిలినవారు వయోజనులు. నిందితుల్లో వయోజనులైన వంశీకృష్ణ (20), పవర్ తరుణ్ (18), సాబ్లే బాలవంత్ సింగ్ (18), గుండల్వార్ వరుణ్ (18), కారడ్ సుధీర్ (28), ముర్కుటే విఠల్ (23) ఉన్నారు. నిందితులను న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా, ఇద్దరు బాలురను నిజామాబాద్ జువైనల్ హోంకు, మిగిలినవారిని రిమాండ్‌కు తరలించారు.

ఈ ఘటనపై మానవ హక్కుల సంఘాలు, స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే సోషల్ మీడియా దుర్వినియోగం ఇంత భయానకంగా మారుతుందంటే, అందుకు సమాజం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories