Bhatti: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్‌: డిప్యూటీ సీఎం భట్టి

Mallu Bhatti Vikramarka
x

Mallu Bhatti Vikramarka

Highlights

Bhatti: వేదికపై ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Bhatti: విద్యతోపాటు సంస్కారాన్ని నేర్పి.. సమాజానికి ఉపయోగపవడేట్టు చేసేవారే గురువు అని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంచి సమాజ నిర్మాణానికి పునాదులు వేసేది ఆదర్శ గురువులేనని కొనియాడారు. గురువులు ఎంత గొప్ప వాళ్లైతే.. సమాజం అంత గొప్పగా ఉంటుందన్నారు భట్టి. ఉపాధ్యాయ దినోతవ్సం సందర్భంగా రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 41 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు.

ప్రభుత్వ పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యల్లో కరెంట్ సమస్య కూడా ఉందన్నారు. రాష్ట్రంలోని మొత్తం 27 వేల 862 ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వమే ఆ ఖర్చును భరిస్తుందని హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories