రేవంత్‌ రెడ్డి పాదయాత్రకు అధిష్టానం అనుమతి ఉందా..? హస్తం పార్టీ నేతల్లో తీవ్ర చర్చ

రేవంత్‌ రెడ్డి పాదయాత్రకు అధిష్టానం అనుమతి ఉందా..?  హస్తం పార్టీ నేతల్లో తీవ్ర చర్చ
x
Highlights

ఏఐసీసీ పిలుపు అందితే గానీ.. అడుగు ముందుకు వేయని కాంగ్రెస్‌ నేతలు.... ఇప్పుడు దూకుడు పెంచారు. ఏకపక్ష నిర్ణయాలతో ప్రణాళికలు రచించుకొని కార్యచరణ మొదలు...

ఏఐసీసీ పిలుపు అందితే గానీ.. అడుగు ముందుకు వేయని కాంగ్రెస్‌ నేతలు.... ఇప్పుడు దూకుడు పెంచారు. ఏకపక్ష నిర్ణయాలతో ప్రణాళికలు రచించుకొని కార్యచరణ మొదలు పెట్టారు. రాష్ట్ర నేతల పంథానచ్చని రేవంత్‌రెడ్డి వర్గపు నేతలు.. అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ కదం తొక్కుతున్నారు. రేవంత్‌ ప్రారంభించిన రాజీవ్‌ భరోసా పాదయాత్ర... జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌‌రెడ్డి చేపట్టిన రాజీవ్ రైతు భరోసా యాత్ర.. తెలంగాణలో హస్తం పార్టీకి బూస్టింగ్‌ ఇచ్చినట్లయ్యింది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా సాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతల వ్యవహారం ఇప్పడు రేవంత్ రెడ్డి వర్గం ఏకపక్ష నిర్ణయంతో హైదరాబాద్‌కు యాత్ర సాగుతుంది.

రైతు దీక్షతో మొదలైన కార్యక్రమం అనూహ్య రీతిలో రాజీవ్ రైతు భరోసా యాత్రతో ముందుకు వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలపై ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో చాలా రోజుల నుంచి రైతు ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఈ క్రమంలో ఇన్నాళ‌్లు స్తబ్ధుగా ఉన్నరాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చడీచప్పుడు లేకుండా దీక్షలకు, యాత్రలకు సిద్దం అవడం ఒకింత జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది.

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరిగిన రాజీవ్ రైతు భ‌రోసా స‌భ‌లో మ‌ల్లు ర‌వి, సీత‌క్క ప్రతిపాదించిన భరోసా యాత్ర... ఊహించని రీతిలో కార్యరూపం దాల్చింది. నేతల మాటెలా ఉన్నా హస్తం కార్యకర్తల అభిష్టం మేరకు పాదయాత్ర దూకుడుగా ముందుకు సాగుతుంది. అయితే ఈ భరోసా యాత్ర ఎన్ని రోజుల సాగుతుంది ఎంత వరకు సాగుతుంది అన్న విషయంలో ఇంతవరకు స్పష్టత రాలేదు.

అయితే ముందు ప్లానో లేక ఊహించని నిర్ణయమో కానీ.. రేవంత్ చేపట్టిన పాదయాత్రకు రైతుల నుంచి విశేష స్పందన లబిస్తుంది. దారిపొడవున రైతులు, కార్యకర్తలు పాదయాత్రకు ఘన స్వాగతం పలుకుతున్నారు. స్థానికుడు, జిల్లా వాసి అయిన రేవంత్‌రెడ్డికి ఈ ప్రాంతంలో ప్రజాధారణ ఉంది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి సంకోచం లేకుండా పాదయాత్ర నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు బావిస్తున్నారు. ఇక ఏఐసీసీ పిలుపు నిచ్చే కార్యక్రమాలనే పక్కకు నెట్టే నేతలు ఉండే పార్టీలో.. రేవంత్ రెడ్డి వర్గం తీసుకున్న సొంత నిర్ణయం ఏమేరకు ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories