రాహుల్ సభపై దూకుడు పెంచిన టీకాంగ్రెస్.. 20ఏళ్ల వరకు చరిత్రలోనే నిలిచిపోయేలా...

T Congress Leaders Arrangements for Rahul; Gandhi Telangana Tour | Live News Today
x

రాహుల్ సభపై దూకుడు పెంచిన టీకాంగ్రెస్.. 20ఏళ్ల వరకు చరిత్రలోనే నిలిచిపోయేలా...

Highlights

Rahul Gandhi - TS Tour: కలిసికట్టుగా ముందుకు వెళ్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు

Rahul Gandhi - TS Tour: తెలంగాణ కాంగ్రెస్ రాహుల్ గాంధీ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో ఎప్పుడు తిట్టుకునే నేతలు కలిసికట్టుగా సమీక్షలు సమావేశాలతో నేతలు బిజీ అయిపోయారు. డూ ఆర్ డై అని ఇన్‌చార్జీలకురాష్ట్ర నేతలు ఉత్సాహం నింపుతున్నారు. 20ఏళ్ల వరకు రాహుల్ సభ చరిత్రలోనే నిలిచిపోయేలా టీపీసీసీ ప్లాన్ చేస్తుంది. ఇందుకోసం కొద్దిరోజులుగా టీపీసీసీ ముఖ్య నేతలంతా రాహుల్ పర్యటనను విజయవంతం చేయడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

ఇప్పటికే వరంగల్ లో పర్యటించిన నేతలు నేటి నుంచి కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, జిల్లాల్లో పర్యటించి సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇందిరాభవన్ లో టీపీసీసీ కార్యవర్గం, పీఏసీ, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జ్ లతో సమీక్ష నిర్వహించారు. మరోవైపు 5లక్షల మందితో భారీ బహిరంగసభకు ప్లాన్ చేశారు. జన సమీకరణ కోసం పార్లమెంట్‌ వారిగా బాధ్యులను నియమించారు. నల్గొండకి - గీతారెడ్డి, భువనగిరికి - జగ్గారెడ్డి, ఖమ్మం - కుసుమ కుమార్,

సమీక్షా సమావేశంలో కొంత మంది నాయకులు సూచనలు ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సభ పేరును రైతు గర్జనగా మారిస్తే బాగుంటుందని భావన వ్యక్తం చేశారు. మేనిఫెస్ట్‌లో కొన్ని నిర్ణయం చేయబోయే పనుల గురించి ప్రజలకు చెప్పాలని తెలిపారు. ఇప్పటి నుండే వాహనాలు సమకూర్చుకోవాలని ఉత్తమ్ సూచించారు. రాహుల్ గాంధీ పర్యటన కోసం గతంలో ఎప్పుడు లేని విధంగా కాంగ్రెస్ నేతలంతా కలిసికట్టుగా కృషి చేస్తుండడం పార్టీలో కొత్త జోష్ కనిపిస్తుంది.. ఇక ఇదే ఉత్సాహం తర్వాత కూడా కొనసాగిస్తారా.. రాహుల్ సభతోనే ముగిస్తారా అని చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories