పోక్సో కేసుల పర్యవేక్షణకు టాస్క్‌ఫోర్స్‌: స్వాతి లక్రా

పోక్సో కేసుల పర్యవేక్షణకు టాస్క్‌ఫోర్స్‌: స్వాతి లక్రా
x
Highlights

ప్రస్తుత పరిస్థితులోల ఎక్కడ చూసినా మహిళలపై వేధింపులు, మానసిక దాడులు, లైంగిక దాడులు విచ్చలవిడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మహిళా భద్రత...

ప్రస్తుత పరిస్థితులోల ఎక్కడ చూసినా మహిళలపై వేధింపులు, మానసిక దాడులు, లైంగిక దాడులు విచ్చలవిడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మహిళా భద్రత విభాగం అడిషనల్‌ డీజీ స్వాతిలక్రా మీడియాతో మాట్లాడుతూ ఆన్‌లైన్‌ వేధింపులు, లైంగికదాడి, పోక్సో కేసులపై మరింత దృష్టి పెట్టేలా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ టాస్క్‌ఫోర్స్‌ రాష్ట్రవ్యాప్తంగా నమోదైన లైంగికదాడి, పోక్సో కేసులపై ఆయా పోలీస్‌స్టేషన్‌ ఇన్వెస్టిగేషన్‌ అధికారులతో నిత్యం మాట్లాడుతుందని వివరించారు. క్షేత్రస్థాయిలో పని ఒత్తిళ్లు, కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నా.. రేప్‌, పోక్సో కేసుల సత్వర దర్యాప్తే లక్ష్యంగా టాస్క్‌ఫోర్స్‌ పనిచేస్తుందని వివరించారు. ఎవరైనా పోకిరీ వేధిస్తున్నట్టు బాధితురాలు వాట్సప్‌లో పోస్ట్‌ చేస్తే షీటీమ్స్‌ అలర్ట్‌ అవుతాయి.

ఫిర్యాదు చేసే వారికి, షీటీమ్స్‌కు మధ్య సమాచార వినిమయం జరిగేలా సాఫ్ట్‌వేర్‌ను వారంలో అందుబాటులోకి తేనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న పోక్సో, లైంగికదాడి కేసుల్లో నిందితులకు సరైన శిక్ష లు పడేలా కేసుల దర్యాప్తు పక్కాగా జరిగేలా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కేసు నమోదైన నాటి నుంచి దర్యాప్తులో అనుసరించాల్సి పద్ధతులు, సకాలంలో మెడికల్‌ పరీక్షలు, నిందితుల అరెస్టు, కేసు దర్యాప్తు అశాలను ఈ టాస్క్‌ఫోర్స్‌ పర్యవేక్షిస్తుందని వివరించారు. బాధితులకు భరోసానివ్వడంతోపాటు ఆకతాయిల ఆగడాలపై నిరంతరం నిఘాపెట్టేందుకు ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నట్టు స్వాతిలక్రా తెలిపారు. రాష్ట్రంలోని అన్ని షీటీమ్స్‌వాట్సప్‌ నంబర్లతో ప్రత్యేకంగా ఒక గ్రూప్‌ రూపొందించారు. దీనిని పైలెట్‌ ప్రాజెక్టుగా నల్లగొండ, కరీంనగర్‌, సైబరాబాద్‌లోఅమలు చేయనున్నట్టు స్వాతిలక్రా తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories