పార్టీ మారితే.. చెప్పి మారుతా : స్వామిగౌడ్

పార్టీ మారితే.. చెప్పి మారుతా : స్వామిగౌడ్
x
Highlights

బీజేపీ నాయకులతో కేవలం ఆత్మీయ కలయిక మాత్రమే అని శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతాను అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు.

బీజేపీ నాయకులతో కేవలం ఆత్మీయ కలయిక మాత్రమే అని శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతాను అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు. ఒకవేళ తానూ పార్టీ మారితే అందరికి చెబుతానని స్పష్టం చేశారు. స్నేహితులను కలిశానని అది కూడా తప్పేనా అని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలు కలవకూడదనే నిబంధనలు ఏమీ లేవని, ఏమైనా ఉంటే మీడియాకి చెబుతానని అయన అన్నారు.

ఏదైనా ఉంటే భవిష్యత్‌లో క్లారిటీ ఇస్తాం : లక్ష్మణ్

బీజేపీతో కలిసి రావడానికి చాలా మంది నాయకులు సిద్ధంగా ఉన్నారని బీజేపీ నేత లక్షణ్ అన్నారు. స్వామిగౌడ్‌తో స్నేహపూర్వకంగానే భేటీఅయినట్లు లక్ష్మణ్ వెల్లడించారు. అయితే ఈ భేటీలో రాజకీయాలు కూడా చర్చించినట్లు లక్ష్మణ్ తెలిపారు. తాము స్వామిగౌడ్‌తో ఎలాంటి ప్రతిపాదనలు చర్చించలేదన్నారు. ఎన్నికలప్పుడు రాజకీయాలు సర్వసాధారణమే అని అన్నారు. ఏదైనా ఉంటే భవిష్యత్‌లో క్లారిటీ ఇస్తామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories