Huzurabad: ఉత్కంఠ రేపుతున్న హుజురాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్

హుజురాబాద్ ఉపఎన్నిక లెక్కింపుపై ఉత్కంఠ (ఫైల్ ఇమేజ్)
Huzurabad: మరొకొద్ది గంటల్లో తేలనున్న నేతల భవితవ్యం
Huzurabad: నువ్వా నేనా అంటూ సాగిన హుజురాబాద్ ఉపఎన్నిక చివరి ఘట్టానికి చేరుకుంది. మరొకొద్ది గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇక ఈ ఫలితంతో ఐదారు నెలల ఉత్కంఠకు తెర పడనుంది. హుజురాబాద్ బాద్‌షా ఎవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.
కొన్ని నెలలుగా ఉత్కంఠ రేపుతున్న హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితం పైనే అందరి దృష్టి నెలకొంది. మరికొద్ది గంటల్లో విజయం ఎవరిని వరిస్తుందో తేలనుంది. ఇప్పటికే కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కాలేజీలో కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు అధికారులు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా మొదటి అరగంటలో పోస్టల్ ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎమ్స్ కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఇక ఓట్ల లెక్కింపుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 14 టేబుల్స్ ఏర్పాటు చేసి 22 రౌండ్లలో కౌంటింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం వరకు తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మొదటి అరగంట పాటు పోస్టల్ బ్యాలెట్లు లెక్కించనున్నారు. మొత్తం 753 మందికి పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. కొవిడ్ నిబంధనల మేరకు రెండు హాల్స్‌లో కౌంటింగ్ జరగనుంది. ఒక్కో హాళ్లో 7 టేబుళ్ల చొప్పున ప్రతి రౌండ్‌కు 14 టేబుల్స్‌పై 14 ఈవీఎంలను లెక్కిస్తారు.
ఇదిలావుంటే, ఈ ఉపఎన్నిక ఫలితాలు రాష్ట్ర రాజకీయాలకు ముడి పెట్టడంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఈసారి అనుహ్యంగా పోలింగ్ శాతం పెరగడం పట్ల అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలోని ఏ ఉపఎన్నికలో ఇంతటి భారీ పోలింగ్ నమోదవలేదని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. కొన్ని గ్రామాల్లో 90 శాతం పైగా పోలింగ్ నమోవడం గమనార్హం.
టీఆర్ఎస్‌లో మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్‌పై అవినీతి ఆరోపణలు రావడం ఆయనపై టీఆర్ఎస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించడం.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో హుజురాబాద్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి బల్మూరు వెంకట్, బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీ చేయగా గెలుపెవరిని వరిస్తుందో వేచి చూడాలి మరి.
ఇక, హుజూరాబాద్ జనం ఎవరిపక్షం వహించారన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇటు గులాబీ నేతలు, అటు కమలనాథులు ఎవరికి వారు సైలెంట్ ఓటు తమకే లాభిస్తుందని క్లెయిమ్ చేసుకుంటున్నారు. కొన్ని సర్వేలు ఈటల గెలుపు తథ్యమంటుంటే. మరికొన్ని సర్వేలు టీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకేనంటున్నాయి. ఇక మరొకొద్ది గంటల్లో జరగునున్న కౌంటింగ్‌తో ఎవరు హుజురాబాద్ బాద్ షాగా నిలుస్తారో చూద్దాం.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
మహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMTఅనిల్ రావిపూడి బాలక్రిష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా!
25 May 2022 3:15 PM GMTఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..
25 May 2022 2:56 PM GMT