Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్‌పై కొనసాగుతున్న సస్పెన్స్

Suspense Continues Over The Suspension Of MLA Raja Singh
x

Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్‌పై కొనసాగుతున్న సస్పెన్స్

Highlights

Raja Singh: రాజాసింగ్ అంశంలో అధిష్టానం తర్జన భర్జన

Raja Singh: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటిస్తారనే ప్రచారం ఊపందుకోవడంతో గోషామహల్ నియోజకవర్గంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆ పార్టీకి చెందిన ప్రస్తుత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ సస్పెన్స్ కొనసాగుతోంది. సస్పెన్షన్ ఎత్తివేస్తారా లేదా అనేది పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. అయితే పార్టీ లైన్‌కు విరుద్ధంగా వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్‌పై అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. అయినప్పటికీ పలు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్. మరో వైపు గోషామ‎హల్ నియోజకవర్గ టికెట్‌ను విక్రమ్ గౌడ్ ఆశిస్తున్నారు. అయితే రాజాసింగ్ అంశంలో నిర్ణయం తీసుకునేందుకు జాతీయ నేతలు తర్జన భర్జన పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఓ వైపు తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండగా.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు.. మరో వైపు రాజాసింగ్ వ్యవహారం ఎటూ తేలకపోవడంతో ఆ పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories