Suryapet: సంచలనం సృష్టించిన సూర్యాపేట కోదాడ ఘటన

Suryapeta Kodad Incident Created a Sensation
x

Suryapeta: సంచలనం సృష్టించిన సూర్యాపేట కోదాడ ఘటన

Highlights

Suryapeta: గంజాయి మత్తుకు బానిసైన కొడుకు కళ్లలో కారం కొట్టిన తల్లి

Suryapeta: సూర్యాపేట కోదాడలో గంజాయి మత్తుకు బానిసైన కొడుకుకు కళ్లలో కారం కొట్టి బుద్ధి చెప్పిన తల్లిపై స్థానికంగా ప్రశంసలు జల్లు కురుస్తోంది. వ్యసనాల బారిన పడ్డ కొడుకును దారిలో పెట్టేందుకు సరైన పని చేశావంటూ స్థానికులు ఆ అమ్మను ఘనంగా సత్కరించారు. 15 ఏళ్ల కుమారుడు గంజాయికి బానిసై ఇంటికి రాకుండా తిరుగుతున్నాడన్న ఆవేదనతో కరెంట్ స్థంబానికి కట్టేసి కంట్లో కారం కొట్టిన ఘటన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

గంజాయి మానేస్తావా మానేస్తావా అంటూ ఆ తల్లి చిదక్కొట్టడం సోషల్ మీడియాలో సంచలనమయ్యింది. హైదరాబాద్ పబ్బులో డ్రగ్స్‌కు అలవాటు పడి పిల్లల విషయంలో తల్లిదండ్రులను చూశాక కోదాడలో తల్లి చేసిన ఘటనను స్థానికులు పోల్చి చూస్తున్నారు. ఐతే తప్పు చేసిన వారిని శిక్షించడం సమంజసమే అయినా చట్టాన్ని పూర్తిగా చేతుల్లోకి తీసుకోవడం దారుణమంటున్నారు ఎక్స్‌పర్ట్స్ హానికలిగించే కారాన్ని కంట్లో కొట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు.

దండించడానికి ఇలాంటి మార్గాలు సబబుకాదంటున్నారు. ఇదంతా అవగాహన రాహిత్యం వల్ల జరుగుతోందని కళ్లు పోతే అందుకు ఎవరు బాధ్యత వహిస్తారంటున్నారు. నాడు అల్లుడ్ని చంపించినోడికి జేజేలు పలికారు. ఇప్పుడు కొడుకు కళ్ళల్లో కారం కొట్టినందుకు సన్మానాలు చేస్తున్నారు. తప్పుకు శిక్షించడం మార్గమైనా అందుకు పద్దతులు కూడా ఉంటాయ్.

ఇటీవల కాలంలో జనాల్లో విపరీతమైన పెఢదోరణులు ప్రబలుతున్నాయ్. దారుణమైన ప్రవర్తనలతో చెలరేగిపోతున్నారు. వీటన్నింటికీ కారణం మానసిక సంఘర్షణలేనంటున్నారు సైకాలజిస్టులు. ఇలాంటి ప్రవర్తనలను దూరం చేసేందుకు వారికి కౌన్సిలింగ్ అవసమంటున్నారు. లేకుంటే ఈ ధోరణులు విచ్చలవిడితనానికి కారణమవుతాయని హెచ్చరిస్తున్నారు. గంజాయి తాగాడని కళ్లల్లో కారం కొట్టినవారు. మరేదో చేశారని ఇంకేదైనా చేస్తే అందుకు బాధ్యత ఎవరి వహిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories