KTR Tweet: కేసీఆర్ పాలనలో సాగు స్వర్ణయుగం.. కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలం

Surviving Telangana Farmer The First Danger Sign Says KTR
x

KTR Tweet: కేసీఆర్ పాలనలో సాగు స్వర్ణయుగం.. కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలం

Highlights

కాంగ్రెస్ పాలనలో రైతు బతుకుకు భరోసానే లేదన్నారు. బురద రాజకీయాలు మినహా సమయానికి సాగు నీళ్లిచ్చే సోయి అలసే లేదన్నారు.

KTR Tweet: KCR పాలనలో సాగు స్వర్ణయుగం అని... కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా విమర్శించారు. ఇది కాంగ్రెస్ సర్కార్ చేసిన కమాల్... తెలంగాణలో సాగు విస్తీర్ణం కళ్లముందే ఢమాల్ అని ఆక్షేపించారు. ఒక్క ఏడాదిలోనే 15.30 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గిందన్నారు. తెలంగాణ రైతు బతుకు ఆగం అవుతుందన్నారు. ఇది తొలి ప్రమాద సంకేతమన్నారు కేటీఆర్.

దశాబ్ద కాలంలోనే దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణలో 8 నెలల్లోనే ఎందుకింత వ్యవసాయ విధ్వంసం అని నిలదీశారు. సంతోషంగా సాగిన సాగులో ఎందుకింత సంక్షోభం అని ప్రశ్నించారు. మొన్న వ్యవసాయానికి కరెంట్ కట్... నిన్న రుణమాఫీలో రైతుల సంఖ్య కట్... నేడు సాగయ్యే భూమి విస్తీర్ణం కట్ చేశారని ఎద్దేవా చేశారు. రుణమాఫీ అని మభ్యపెట్టి పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టడం వల్లే రైతులకు ఈ అవస్థ ఏర్పడిందన్నారు.

క్వింటాల్‌కి 500 రూపాయల బోనస్ అని నిలువునా మోసం చేసింది కాంగ్రెస్ వ్యవస్థ అని విమర్శించారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయ్ కానీ చేతలు సచివాలయం గేటు దాటడం లేదన్నారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు అన్నదాతలది అత్యంత దయనీయ పరిస్థితి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగించుకునే విజన్ లేదు రిజర్వాయర్లు నింపే ప్రణాళిక లేదని చెరువులకు నీటిని మళ్లించే తెలివి లేదన్నారు.

కాంగ్రెస్ పాలనలో రైతు బతుకుకు భరోసానే లేదన్నారు. బురద రాజకీయాలు మినహా సమయానికి సాగు నీళ్లిచ్చే సోయి అలసే లేదన్నారు. ఎరువులు, విత్తనాల కోసం రైతులకు తిప్పులు క్యూలైన్‌లో పాసుబుక్కులు, చెప్పులు కనిపిస్తున్నాయన్నారు. కొత్త రుణాల కోసం రాత్రింభవళ్లు పడిగాపులు కాస్తున్నారన్నారు. అప్పుల బాధతో అన్నదాతల ఆత్మహత్యలు కౌలు రైతుల బలవన్మరణాలు ఇలా సాగు విస్తీర్ణం తగ్గడాలని సవాలక్ష కారణాలున్నాయని ఎక్స్‌లో పోస్ట్ చేశారు కేటీఆర్.


Show Full Article
Print Article
Next Story
More Stories